| కీర్తనలు | త్యాగరాజు | సొగసుఁ జూడఁదరమా నీ |
| కన్నడ గౌళ - రూపక |
| పల్లవి: |
| సొగసుఁ జూడఁదరమా నీ సొ.. |
| అను పల్లవి: |
| నిగనిగమనుచుఁ గపోలయుగముచే మెఱయు మోము సొ.. |
| చరణము(లు): |
| అమరార్చిత పదయుగమో అభయప్రద కరయుగమో కమనీయ తనునిందిత కామ కామరిపునుత నీ సొ.. |
| వరబింబ సమాధరమో వకుళ సుమంబుల యురమో కర ధృతశర కోదండ మరకతాంగవరమైన సొ.. |
| చిఱునవ్వో ముంగురులో మఱి కన్నులతేటో వర త్యాగరాజార్చిత వందనీయ ఇటువంటి సొ.. |