| కీర్తనలు | త్యాగరాజు | సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ |
| శ్రీరంజని - రూపకము |
| పల్లవి: |
| సొగసుగా మృదంగతాళము జతగూర్చి నినుఁ జొక్కఁజేయు ధీరుఁడెవఁడో ॥సొ॥ |
| అను పల్లవి: |
| నిగమ శిరోర్థము గల్గిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో ॥సొ॥ |
| చరణము(లు): |
| యతివిశ్రమ సద్భక్తి వి రతిద్రాక్షారస నవరసయుత కృతిచే భజియించే యుక్తి త్యాగరాజుని తరమా శ్రీరామ ॥సొ॥ |