| కీర్తనలు | త్యాగరాజు | హరియనువారి సరి యెవ్వరే |
| తోడి - ఆది (దివ్యనామము) |
| పల్లవి: |
| హరియనువారి సరి యెవ్వరే ॥హ॥ |
| అను పల్లవి: |
| పలువిధముల తలపుల రోసి నిలువరమగు భక్తియుఁ జేసి మలయని మతభేదముఁ గోసి ॥హ॥ |
| చరణము(లు): |
| కరఁగుచు మదిలోఁ గామించి హరి చరణములను హృదయమునుంచి వరశుకముఖ ధనమని యెంచి ఈ సుఖమెఱుఁగని జనచెలిమి వాసుకి విసమే మఱికొలిమి నిజ దాసుల సంభాషణ బలిమిన్ ॥హ॥ |
| నీ జపమున హృదయము వేగ రాజిల్లను జేసిన త్యాగరాజనుతుని పేరులబాగ ॥హ॥ |