| కీర్తనలు | త్యాగరాజు | హెచ్చరికగా రార హే రామచంద్ర |
| యదుకులకాంభోజి - జంప |
| పల్లవి: |
| హెచ్చరికగా రార హే రామచంద్ర హెచ్చరికగా రార హే సుగుణసాంద్ర ॥హె॥ |
| అను పల్లవి: |
| పచ్చవిల్తునితండ్రి పాలితసురేంద్ర ॥హె॥ |
| కనకమయమౌ మకుటకాంతి మెఱయఁగను ఘనమైన కుండలయుగంబు కదలఁగను ఘనమైన నూపురయుగంబు ఘల్లనఁగ సనకాదు లెల్లఁగని సంతసిల్లగను ॥హె॥ |
| ఆణిముత్యాలసరు లల్లలాడఁగను వాణీపతీంద్రు లిరువరుస పొగడగఁను మాణిక్య సోపానమందు మెల్లగను వీణపలుకుల వినుచు వేడ్కచెల్లగఁను ॥హె॥ |
| నినుఁ జూడవచ్చు భగినికరంబు చిలుక మనసు రంజిల్ల నీ మహిమలను బలుక మినువాసులెల్ల విరులను చాల జిలుక ఘనత్యాగరాజు కనుగొన ముద్దు గులుక ॥హె॥ |