| కీర్తనలు | త్యాగరాజు | రామచంద్ర నీ దయ రామ ఏల రాదయ |
| సురటి - ఆది |
| పల్లవి: |
| రామచంద్ర నీ దయ - రామ ఏల రాదయ ॥రామ॥ |
| చరణము(లు): |
| కామకోటి సుందర - కరధృత మందరా ప్రేమమీర ముందర - బిల్వ రాక యుందురా ॥రామ॥ |
| కాననంబు తాపమో - కైక మీద కోపమో నేను జేయు పాపమో - నీకు శక్తి లోపమో ॥రామ॥ |
| ఆడదన్న రోసమో - అలనాడు పాసమో మేడలేని వాసమో - మేము జేయు దోసమో ॥రామ॥ |
| కల్లలైన నేయమా - కంటె నీకు హేయమా తల్ల డిల్ల న్యాయమా - త్యాగరాజ గేయమా ॥రామ॥ |