| కీర్తనలు | త్యాగరాజు | ఎదుట నిలచితే నీదు సొమ్ము - లేమి బోవురా |
| శంకరాభరణము - ఆది |
| పల్లవి: |
| ఎదుట నిలచితే నీదు సొమ్ము - లేమి బోవురా ఎదుట.. |
| అను పల్లవి: |
| నుదుటి వ్రాత గని మట్టు మీరను నా తరము దెలిసి మోసపోదునా ఎదుట.. |
| చరణము(లు): |
| సరాసరిగ జూతురా నా అవ - సరాల దెలియుము వరాలడుగ జా లరా సకలదేవరాయ! మనవి వి - నరాఘహర! సుందరాకార నా ఎదుట.. |
| విదేహజా రమణ! దేవ! బ్రోవగ - నిదే సమయ మన్యదేవతలవే డదే మనసు తెలియదేమి రాఘవ - ఇదేటి శౌర్యము పదేపదేనా ఎదుట.. |
| తరాన దొరకని పరాకు నాయెడ - ను రామ చేసితె సురాసురులు మె త్తురా ఇపుడు ఈ హరామితనమే - లరా భక్త త్యాగరాజనుత! నా ఎదుట.. |