| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నెరనమ్మితి నీవేగతి |
| చక్రవాక - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నెరనమ్మితి నీవేగతి ధరణీసుతా వరరామ నిన్నే॥ |
| అనుపల్లవి: |
| పరిపూర్ణ కటాక్షముతోను నన్ను కరుణించుట కిదే సమయమని॥ |
| చరణము(లు): |
| నన్ను బ్రోచుట నీకెంత భారము నావిన్నపంబు వినరాద నాతో వాదా॥ |
| కన్నతండ్రి నీవే గద సన్నుతాంగ శ్రీవాసుదేవ సదా॥ |