| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | అభిమానముతో నన్ను బ్రోవరాద |
| షణ్ముఖప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| అభిమానముతో నన్ను బ్రోవరాద దీనబాంధవ శ్రీవాసుదేవ॥ |
| అనుపల్లవి: |
| శ్రీనికేతన నీనామము ప్రేమతో ధ్యానము సేయుట సుజ్ఞాన మొసగరాద॥ |
| చరణము(లు): |
| వారిధిశయన వారిజలోచన వారిత దుర్జన వరఖగవాహన॥ |
| కరిమోరలిడ నీవు కరుణతో బ్రోవలేద పరమపురుష నిన్నే నమ్మిన వాడ గద॥ |