| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | గానసుధారస పానముజేసే |
| ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| గానసుధారస పానముజేసే మానవులే ధన్యులు ఈ భువిలో॥ |
| అనుపల్లవి: |
| ఈ నరదేహము స్థిరమని తెలియక గానలోలుని వాసుదేవుని మరవక॥ |
| చరణము(లు): |
| యోగివరేణ్యుడైన నారదముని కృపతో భాగవతాగ్రేసరుడని వెలసిన॥ |
| త్యాగరాజుని మరి మహాత్ములను దలచుకొని రాగ లయాదులను బాగుగ దెలుసుకొని॥ |