| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీపాదములను నమ్మితినయ్య |
| నాయకి - ఖండజాతి ఆట |
| పల్లవి: |
| నీపాదములను నమ్మితినయ్య శ్రీపార్థసారథి నీవేగతియని॥ |
| అనుపల్లవి: |
| నాపాపజాలమెల్ల దీర్చి కాపాడుట కెవరున్నారయ్య॥ |
| చరణము(లు): |
| వాసుదేవ వనజాయత లోచన వాసుకిశయన వరఖగవాహన॥ |
| నీసాటిదైవ మెవరనిగాన ఓసాధుజనజీవన నిజముగ॥ |