| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మరచితివేమోనన్ను - మరవకుర రామ |
| పూర్వకల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మరచితివేమోనన్ను - మరవకుర రామ పరమపురుష - వాసుదేవ - పరాత్పర॥ |
| అనుపల్లవి: |
| ధరణిజా మానసాంభోరుహ భాస్కర సురరిపు రావణాద్యరిహర సుగుణాకర॥ |
| చరణము(లు): |
| పతితపావన నీవేగతియని నిజముగ సతతము నమ్మితి సరసిజలోచన॥ |
| క్షితిపతి దశరథాత్మజ లక్ష్మణాగ్రజ శ్రితజనాధారుడని నీబిరుదుండగ॥ |