| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర |
| భైరవి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర నీ పదాంభోజము - నే విడజాల॥ |
| అనుపల్లవి: |
| పన్నగారి వాహన - పాలిత వారణ పతితపావన - వాసుదేవ - పన్నగశయన॥ |
| చరణము(లు): |
| భూమిజా రమణ - నీ కెందుకు నిర్దయ నీమహిమల నేనేమని పొగడుదు॥ |
| శమధన నుతాశ్రిత కామితదాయక కమలసంభవాది పూజిత - నిన్నె నెరనమ్మితి॥ |