| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రారా యని పిలిచితే - రావదేమిరామ |
| ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| రారా యని పిలిచితే - రావదేమిరామ లోకాభిరామ - కోదండరామ - పట్టాభిరామ॥ |
| అనుపల్లవి: |
| ఈరేడు లోకములలో - నీవలె శరణాగతరక్షకుడు వేరెవరున్నారు - కరుణా జలనిధే తామసంబు సేయక॥ |
| చరణము(లు): |
| ఇలలో ఈకలిలో - జేసిన దెల్ల మరచితివేమో అలనాడు నీవె రామదాసుని బ్రోవలేద॥ |
| ఏలావతారమెత్తితివో - యేమేమి జేసితివో ఈలాగని నిన్ను వర్ణింపలేను - వాసుదేవ బ్రోవు॥ |