| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఇదినీకు న్యాయమా శ్రీరామ |
| గమనశ్రమ - మిశ్ర చాపు |
| పల్లవి: |
| ఇదినీకు న్యాయమా శ్రీరామ ఇదినన్నుబ్రోవ సమయముగాదా॥ |
| అనుపల్లవి: |
| సదయుడు నీవని చాలనమ్మితె - నీ హృదయము కరగదా - పరిపూర్ణకామ॥ |
| చరణము(లు): |
| వారిజదళనేత్ర - వారిదనిభగాత్ర వాతాత్మజనుత - వరమునివందిత॥ |
| సురవైరి రావణాసురహర శ్రీకర పరిహృతభవభయ పరవాసుదేవ॥ |