| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥ |
| నాటకప్రియ - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| ఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥ |
| అనుపల్లవి: |
| సదయహృదయ సర్వేశ మదనకోటిసుందర॥ |
| చరణము(లు): |
| కరుణజేసి మును నీవే కరిరాజుని బ్రోవలేదా మురహర మందరగిరిధర మురళీధర శ్రీకర పరమ పురుష వాసుదేవ గరుడగమన గానలోల॥ |