| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీపురందర గురువరం భావయేహం |
| సరస్వతీ మనోహరి - మిశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శ్రీపురందర గురువరం భావయేహం శ్రీముఖచంద్ర చకోర సేవా చతురం శ్రితకల్ప భూరుహం॥ |
| అనుపల్లవి: |
| శ్రీపురుషోత్తమానుగ్రహ పాత్రం సుచరిత్రం శ్రీమన్మధ్వ శాస్త్రబోధన తత్పరం శ్రీశ సాక్షాత్కార సంతుష్టహృదయముదారం॥ |
| చరణము(లు): |
| పరమ దయాసాగరం వర నారదావతారం పరమాద్భుత కృత్య దర్శకం గానకలోద్ధారకం వరగురు వ్యాసరాజ యతివర్య శిష్యాగ్రేసరం పర వాసుదేవ హృన్మందిర ముపనిషత్సమాన కీర్తన కర్తారం వారం వారం॥ |