| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | సిగ్గులేదు నాకించుకైన జూడ |
| బలహంస - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| సిగ్గులేదు నాకించుకైన జూడ ఎగ్గులంతజేసి ఇంతనిన్ను వేడ॥ |
| అనుపల్లవి: |
| దగ్గర నీవుండ దయవేడక యగ్గలికమున జేసిన పనులను విను॥ |
| చరణము(లు): |
| అన్యాయార్జనాసక్త చిత్తుడు అన్యాన్న భోక్తాతిలోలుడు॥ |
| ధన్యాత్ముడనుగాను బ్రోవమనగ కన్నతండ్రి వాసుదేవ కృపానిధి॥ |