| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥ |
| ధన్యాసి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥ |
| అనుపల్లవి: |
| శమాది సంపద్గుణగణభరితం బుధజనతోషణ నిరతం రమాపతి ప్రియతమ మధ్వాగమాబ్ధి పారగమద్భుత చరితం॥ |
| చరణము(లు): |
| పరమానుగ్రహ నిజపద సుస్థాపిత విద్యావారిధి తనయం శరణాగత జనరక్షణ నిపుణం కరుణాపూరిత హృదయం॥ |
| వరశిరోధిసంశోభిత తులసీదళమాలం సుందరకాయం సరసగాన శిరోమణి వాసుదేవ గానాతిప్రియం॥ |