| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కనికరముతో నన్ను బ్రోవరాద |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కనికరముతో నన్ను బ్రోవరాద కరివదన శ్రీవాసుదేవ నీవు॥ |
| అనుపల్లవి: |
| సనక సనందనాది మునిజన చరణ దినపతి కులాభరణ జానకీరమణ॥ |
| చరణము(లు): |
| మునివర కౌశికాధ్వర పరిపాల అనుపమ కుశలవగాన విలోల॥ |
| దానవారి పరిపాల కనకమయచేల దనుజ సంహరణలీల ఆనందకర శీల॥ |