| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | బాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥ |
| భైరవి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| బాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥ |
| అనుపల్లవి: |
| బాలేందుభూషణాదివినుతం సుగుణభరితం నీలరుచిర కుంతలజాల శోభితం నిగమవేద్య మహిమాన్వితం॥ |
| చరణము(లు): |
| భవాబ్ధితారక మిభేంద్ర వరదం సమ్మోదిత నిజభక్తబృందం భరద్వాజాదిసేవిత చరణం భవ్య వనమాలికాభరణం దేవదేవమనంతావతారం దేవకీకుమారం పరాత్పరం॥ |
| జీవేశ్వరం రుక్మిణీరమణం పురాణపురుషం భూసురశరణం శ్రీవాసుదేవం వరమందహాసవదనం జితమదనం రవిశశినయనం పవనాత్మజ పరమానందదం మధుమథనం॥ |