| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మామవమృడజాయే మాయే |
| వసంత - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మామవమృడజాయే మాయే మరకత మణివలయే గిరితనయే॥ |
| అనుపల్లవి: |
| సోమకులజ జయచామ మహీపతి కామిత ఫలదాయిని కాత్యాయని॥ |
| చరణము(లు): |
| నారదాదిముని మానస సదనే తారకాధిపతి సన్నిభవదనే॥ |
| చారురత్నరశనే సురదనే సారసలోచనే సామజగమనే॥ |
| సూరిజనావన నిరతే లలితే సారతరాగమ మహితే సుచరితే॥ |
| భూరికృపాన్వితే సురగణవినుతే మారజనక వాసుదేవ సహజాతే॥ |