| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | గిరిజారమణ నతజనశరణ |
| గంభీరనాట - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| గిరిజారమణ నతజనశరణ కరుణారసపూర్ణ స్మరహర నాగాభరణ॥ |
| అనుపల్లవి: |
| పరవాసుదేవారాధనధురీణ కరధృతహరిణ కలిమలహరణ॥ |
| చరణము(లు): |
| మహాపంచాక్షరీ మంత్రమూర్తే మహాభక్తకౌంతేయనుతకీర్తే॥ |
| మహాగణపతి గుహసేవితమూర్తే మహాదేవ పరిహృతదీనజనార్తే॥ |
| మహానంది భృంగ్యాది గంభీర నాట్య ప్రదర్శక కైలాసపతే॥ |