| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దేవాదిదేవ శ్రీవాసుదేవ |
| సునాదవినోదిని - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దేవాదిదేవ శ్రీవాసుదేవ కావుమయ్య నన్ను కరుణాలవాల॥ |
| అనుపల్లవి: |
| ఈవేళ నాయారు శత్రులను నీవే పారద్రోలి నిజభక్తుజేసి॥ |
| చరణము(లు): |
| నే జేసిన పూజాఫలమో నాపూర్వజుల పుణ్యఫలమో॥ |
| శ్రీజానకీశ ఈజన్మమిచ్చి నన్ను ధన్యునిగ భువిజేసితివి॥ |