| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 27. మేలుకో | |
| లేవరా నిదర లేవరా మామ లేవోయీ నిదరమేలు కోవోయీ! | |
| పకపకమని నవ్విందీ పచ్చని పైరు, ఆ పైరుమీద నీడలేవో పాకుతున్నవి | |
| లేవరా... | |
| మనకీ ఈ బూదేవికి మద్దెనున్నదీ మటు మాయదారి బూతమేదొ మసులుతున్నదీ | |
| లేవరా... | |
| మనదికాదురా ఈసిరి మనది కాదులే ఈ మంటికి జీవము పోసిన మహరాజా లే | |
| లేవరా.. | |
| రక్కెసపొదవెన్క నెవరొ నిక్కుతున్నరు; అటు తక్కుతు తారుతు పొలాన నక్కుతున్నరు | |
| లేవరా... | |
| పలపలమని విరిసిందీ పంటలచ్చిమీ; దాపున కంకుల కంఠాన నేదొ కళుకుమన్నదీ | |
| లేవరా... | |