| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 40. పేదబ్రతుకు |
| 40. పేదబ్రతుకు | |
| పేదబ్రతుకు నర్పించెడు భాగ్యము లేదా యిక నీ పాదదాసికిని ప్రేమామృతసరసీమరాళినై నీ మురళీనవనీతగీతినై పేదబ్రతుకు నర్పించెడు భాగ్యమె లేదా యిక నీ పాదదాసికిని | |
| గాలికౌగిళులఁ దేలు పూవువలె నీలిమబ్బుపయి వ్రాలు మెఱుపువలె తేలిపోని కలవోలె, నీ యెడఁద పూలదండనయి వ్రేలుచు వలచుచు పేదబ్రతుకు నర్పించెడు భాగ్యము లేదా యిక నీ పాదదాసికిని | |