| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| పసరు మహిమచేఁ బ్రవరుఁడు హిమాద్రి కేఁగుట | ||
| క. |
ఆ మం దిడి యతఁ డరిగిన భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్ష\న్. |
79 |
| వ. |
అనిన విని యమ్మహీసురవరుఁ డట్లరిగి యెట్లు ప్రవర్తించె, నతని పుణ్యవర్తన శ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు గల్పించెఁ, దరువాతి వృత్తాంతంబుఁ గృపాయత్త చిత్తంబున నానతీయ వలయు నని యడుగుటయును. |
80 |