| కావ్యములు | మను చరిత్రము | తృతీయాశ్వాసము |
| మన్మథోపాలంభము | ||
| వ. |
అని పలికి యక్కలికి తేనియ లొలుకు పూములుకుల జళుకుఁ బుట్టించు నించువిలుతు నుద్దేశించి. |
45 |
| చ. |
తొడిఁబడఁ బాఱి పైకుఱికి ధూర్జటి కంటి కడిందిమంటలో నడపొడ గానరాక తెగటాఱియుఁ గాలినయట్టి మ్రోడు కై వడి, రతిలోచనాంబువుల వాన నిగిర్చితె పాంథబాధకై? మడియ కనంగ! యవ్వెలఁది మంగళసూత్రమహత్త్వ మెట్టిదో! |
46 |
| శా. |
సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంపినన్ స్వాహాకాముకుఁడౌట ని న్నతఁడు గావం బోలు మోమోడి, సం దేహంబేని రతీశ! నీవు మగుడన్ దేహంబుతో నుండు టె ట్లాహా! దైవము దోసకారులకె తోడై వచ్చు నెప్పట్టునన్. |
47 |
| చ. |
జడ నొక యింత లేని నెఱ చక్కఁదనంబుల నెల్లఁ గూర్పఁగాఁ బొడ వయినట్టి ధన్యుఁడవు భోగివి పూవిలుకాఁడ విట్టి నీ వెడపక నిష్ఠురత్వమున కెట్లలవాటుగఁ జేసి తక్కటా! పడఁతులమీఁద నేయ రతిపయ్యెదకున్ నను పైన చేతులన్. |
48 |