కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము
సర్వమానవ సమిష్టి బాధ్యతను
    వెలలేని వెన్నెముకపై
మోయుచున్నది సీత! -- అడుగు
    పడినపు డామేర ఆమేర
కూకటివేళ్లతో పాతాళము కదిలినటుల
    కృంగగా, కృంగగా, నా హృదయము
కూలుతూ కుప్పగ దొంత్ర దొంతరలుగ కూలిపోయె!

అష్టదిగ్గజములార! సీత
యీ క్షితిని మోయుచున్నది లెండు!
సాయ మొనర్ప రండు లేనియెడ
వైచెద యెదురులేని శర పరంపరల!
AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )