| కవితలు | విష్ణుధనువు | (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము |
|
ఓ సౌమిత్రి! రాడదేమోయీ! విశ్వామిత్రుడేడోయీ! పోయి స్వయంవర వైదేహీవయోవిలాసలాస్యలావణ్యధనువు ధరించుటకు నర్తనలతో భుజకీర్తు లదరుచున్నవి, రెక్కలువచ్ఛి ఉప్పెనలెత్తుచున్నవి!! తల్లివలె చల్లని కనులతో జూతువుగాన తల్లీయనగ తప్పులేదు! చెల్లెలివలె చనవుమీర సరసజేరుదువుగాన చెల్లీయన చేటురాదు! మేధామద విదళిత వికసితవుగాన మైథిలివందు! ఆత్మాంతరమున 'విట్' దేహవాసివిగాన వైదేహివందు! చాళుక్యహోయసల చినచోడాంబవుగాన సాలగ్రామసీతవందు! కుండలినీ షట్చక్రతతికి యధిపతివి గాన క్షేత్రవతివందు! అందును, ఎందునులేని నామముల నేరికూర్చి గడియకొకరీతి పిలుతు అదియునుగాక అన్నిటికి మిన్నయౌ శ్రీవి నీవేయని పురుషకారమే పరశురామమందు! నేనేరాముడ! ఇదియ నాయింగితము ఇదియ నావిష్ణు సంగీతము! |