| కవితలు | విష్ణుధనువు | (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము |
|
తిరుగంధ జలకలశ హస్తయగు కలధౌత పాదుకల ప్రభాతదేవి వలె, తిరుగంధ జలములు గల కలధౌతపాత్రపై కడియాలతో లలన నృత్యాలద్రొక్కగా వెన్నెల్లో, ముత్యాలురాలినవి వెన్నెల్లో, మ్రోగినవి తప్పటడుగుల విడెపు దండకడియాలు! కూర్చిన ముత్యాలకుప్ప చెదిరినరీతి, రంగైన రత్నాలరాశి పరిచినరీతి, చిలికిన జలకములు ఒలకగా గాలిలో చినుకులైనై! కడియాల జవరాలి తప్పటడుగుల విడెపు దండకడియాల మేల్కొల్పునకు నా యడదవీధిలో ముత్యాల నామనసు ముగ్గు లేసింది! రత్నాల నామనసు రంగు లేసింది! జాగారాల నామనసు చెంగల్వ రంగవళులల్లుకొని నిరీక్షించినది - సంక్రాంతిగౌరి కరహారతుల మురిపెములకై! |