| డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు
|
| డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
|
| డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది
|
| డబ్బుకుండే విలువ మానానికైనా లేదు
|
| డబ్బుకోసం గడ్డి తినే రకంలాగా
|
| డబ్బుకూ, ప్రాణానికీ లంకె
|
| డబ్బు దాచిన వాడికే తెలుసు - లెక్క వ్రాసిన వాడికే తెలుసు
|
| డబ్బు పాపిష్టిది
|
| డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది
|
| డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు
|
| డబ్బురాని విద్య కూడు చేటు
|
| డబ్బురాని విద్య దరిద్రానికే
|
| డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు
|
| డబ్బు సభ కడుతుంది - ముద్ద నోరు కడుతుంది
|
| డాబుసరి బావా! అంటే డబ్బులేదే మరదలా! అన్నాడట
|
| డూ డూ బసవన్నా అంటే తలూపినట్లు
|
| డొంక తిరుగుడు మాటలు
|
| ఢిల్లీ రాజు కూతురైనా పెళ్ళి కొడుకుకు లోకువే
|
| ఢిల్లీ రాజైనా తల్లికి కొడుకే
|