| దంచలేనమ్మ ఊదూది చూచిందట
|
| దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు
|
| దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు
|
| దండుగలో దండుగ
|
| దంపినందుకు బొక్కిందే కూలి
|
| దంపినమ్మకు బొక్కిందే దక్కుడు
|
| దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు
|
| దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు
|
| దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లు
|
| దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ
|
| దగ్గూ, గజ్జీ దాచినా దాగవు
|
| దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?
|
| దప్పిక కొన్నప్పుడు బావి త్రవ్వినట్లు
|
| దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదు
|
| దమ్మిడీ పెళ్ళికి ఏగానీ బోగం మేళం
|
| దమ్మిడీ ముండకు ఏగానీ క్షవరం
|
| దయలేని అత్తకు దణ్ణం పెట్టినా తప్పే - లేకున్నా తప్పే
|
| దయ్యం పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి
|
| దయ్యాలతో చెలిమి చేసినట్లు
|
| దరిద్రానికి మించిన బాధ లేదు
|
| దరిద్రానికి మాటలు హెచ్చు - తద్దినానికి కూరలు హెచ్చు
|
| దరిద్రుడికి అంటనప్పుడు ఆముదం రాచినా అంటదు
|
| దరిద్రుడికి ఏరేవు కెళ్ళినా ముళ్ళపరిగే
|
| దరిద్రుడికి పిల్లలెక్కువ
|
| దరిద్రుడి చేనుకు వడగండ్ల వాన
|
| దరిద్రుడు తలగడుగబోతే వడగండ్ల వాన కురిసిందట
|
| దరిద్రునికి దైవమే తోడు
|
| దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం
|
| దరిలేని బావి - వితరణలేని ఈవి
|
| దశకొద్దీ దొరికాడు దిసిమొల మొగుడు
|
| దశకొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలు
|
| దశ దానాలకూ తోటకూర కట్టే
|
| దశ వస్తే దిశ కుదురుతుంది
|
| దాగబోయి తలారి యింట్లో దూరినట్లు
|
| దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు
|
| దానం చేయని చెయ్యీ - కాయలు కాయని చెట్టూ ఒక్కటే
|
| దానాలలోకెల్లా విద్యాదానం శ్రేష్ఠం
|
| దాయాది వుంటే నిప్పెందుకు?
|
| దారం లేని సూదిని దయ్య మెత్తుకుపోతుంది
|
| దారిన దొరికింది ధర్మానికి పోయింది
|
| దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు
|
| దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేసినట్లు
|
| దాలి గుంటలో కుక్క మాదిరి
|
| దాసరిపాట్లు దైవాని కెరుక
|
| దాసుని తప్పు దండంతో సరి
|
| దింపుడు కళ్ళాశ
|
| దిక్కు లేని యిల్లు దయ్యాల నిలయం
|
| దిక్కు లేని వారికి దేవుడే దిక్కు
|
| దిగంబర సన్న్యాసికి చాకలెందుకు?
|
| దిగితే గానీ లోతు తెలియదు
|
| దిన దిన దండం నూరేళ్ళాయుష్షు
|
| దినబత్తెం దివిటీ వెలగు
|
| దినమూ చచ్చేవాడికి ఏడ్చే దెవరు?
|
| దివిటీ ముందు దీపం పెట్టినట్లు
|
| దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒక్కటే
|
| దీపం ఉండగానే యిల్లు చక్కబెట్టుకోవాలి
|
| దీపం పేరు చెబితే చీకటి పోతుందా?
|
| దీపం ముడ్డి క్రిందనే చీకటి
|
| దీపావళికి దీపమంత చలి
|
| దీపావళికి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతాయి
|
| దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు
|
| దుక్కి వుంటే దిక్కు వుంటుంది
|
| దుక్కికాని చేను తాలింపులేని కూర
|
| దుక్కికొద్దీ పంట - బుద్ధి కొద్దీ సుఖం
|
| దుక్కి చాలని చేనుకు ఎరువు ఎంత పెట్టినా వట్టిదే
|
| దుక్కిటెద్దు చావు పక్కలో పెళ్ళాం చావు వంటిది
|
| దుక్కి దున్నితేనే భూమికి శాంతం
|
| దుత్తకు పాల రుచి తెలుసా?
|
| దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండినట్లు
|
| దున్నగలిగేవాడికే ధరణి దీవెన
|
| దున్న గలిగితేనే మన్ను ముట్టుకోవాలి
|
| దున్నటం ఎవడైనా దున్నుతాడు - పంట పండించేవాడే కావాలి నాకు అందిట
|
| దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు
|
| దున్నపోతు మీద వాన కురిసినట్లు
|
| దున్నబోతే దూడల్లోనూ మేయబోతే ఎడ్లలోనూ
|
| దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ వుంటే నీళ్ళు
|
| దున్నే ఎద్దునే పొడిచేది
|
| దున్నేవాడు లెక్కలేసుకుంటే నాగలికూడా మిగలదు
|
| దున్నేవానికి దడవనా తొక్కేవానికి వెరవనా అన్నదట
|
| దుర్మార్గానికి తండ్రి బద్ధకం
|
| దుష్టులకు దూరంగా ఉండాలి
|
| దూకు దూకుమనే వాళ్ళేగానీ, దూకే వాడు ఒక్కడూ లేడు
|
| దూబర తిండికి తూమెడు
|
| దూరపు కొండలు నునుపు
|
| దూస్తే దోసెడు - ఊదితే హుళక్కి
|
| దెబ్బకి దెయ్యం వదులుతుంది
|
| దెబ్బకొడితే దేవేంద్రలోకం కనబడాలి
|
| దేవతలకు దుమ్ము - రాక్షసులకు మన్ను
|
| దేవర చిత్తం - దాసుడి భాగ్యం
|
| దేవర తలిస్తే దెబ్బలకు కొదువా?
|
| దేవుడని మ్రొక్కితే దయ్యమై పట్టినట్లు
|
| దేవునికి చూపులు - మనకి మేపులు
|
| దేవునికి ముడుపు - దయ్యానికి దెబ్బ
|
| దేవుడి పెండ్లి కందరూ పెద్దలే
|
| దేవుడు తలిస్తే సంపదలకు కొదవా?
|
| దేవుడు వరమిచ్చినా, పూజారి వరమీయడన్నట్లు
|
| దేహి అంటే నాస్తి అనరాదు
|
| దైవబలం మహాబలం
|
| దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు
|
| దొంగండీ అంటే ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నాడట
|
| దొంగకు తేలు కుట్టినట్లు
|
| దొంగకు తోడు - దొరకు సాక్షి
|
| దొంగకు తోడు దొంగ
|
| దొంగకు దొంగ సహవాసం
|
| దొంగకు దొంగబుద్ధి - దొరకు దొరబుద్ధి
|
| దొంగకు దొరికిందే చాలు
|
| దొంగకు భయము - లంజకు సిగ్గు లేవు
|
| దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు
|
| దొంగ చేతికి తాళ మిచ్చినట్లు
|
| దొంగతనానికి పోతూ డోలు చంకన పెట్టుకుని పోయినట్లు
|
| దొంగను దోస్తే దాదూ లేదు - ఫిర్యాదూ లేదు
|
| దొంగపోటు కంటే లింగ పోటెక్కువయిందిట
|
| దొంగ పోయి తలారింట దూరినట్లు
|
| దొంగల సొమ్ము దొరలపాలు
|
| దొంగల సొమ్ము పరులపాలు
|
| దొంగలందరూ దుష్టులు కారు - దుష్టులందరూ దొంగలే
|
| దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు
|
| దొంగలూ దొంగలూ కలిసి వూళ్ళు పంచుకున్నట్లు
|
| దొంగవాడి దృష్టి మూటమీదనే
|
| దొంగాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే
|
| దొంగవాని తల్లికి ఏడువ భయం
|
| దొంగిలించపోతే మంగలం దొరికిందట
|
| దొందూ దొందే
|
| దొడ్డివాకిట దయ్యాన్ని తరిమితే, తలవాకిట వచ్చి నిల్చిందట
|
| దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకుపోతే గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి
|
| దొరకని పూలు దేవునికర్పణం
|
| దొరల చిత్తం - చెట్టు నీడ నిలకడ లేనివి
|
| దొరికితే దొంగ - దొరకకపోతే దొర
|
| దొరబిడ్డ అయినా ఒకనికి పెండ్లామే
|
| దోచుకుపోయినవాడు దొర - దొరికినవాడు దొంగ
|
| దోసకాయ తిన్న కడుపూ, దొంగలు దోచిన యిల్లూ ఒక్కటే
|
| దోసెడు కాంతులు - వెన్నెల వూసులు
|
| దౌర్భాగ్యపు దామోదరుడు
|
| ద్రవిడ ప్రాణాయామంలాగా
|
| ధనమొస్తే దాచుకోవాలి - రోగమొస్తే అమ్ముకోవాలి
|
| ధనియాల జాతి వాళ్ళలాగా
|
| ధరకు దొర ఎవడు?
|
| ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ
|
| ధరణికి గిరి భారమా?
|
| ధరించే ఎరువున్నా భరించే పొరుగులేదు
|
| ధర్మానికి చీర యిస్తే, యింటికి వెనక్కి వెళ్ళి మూర వేసిందట
|
| ధర్మానికిపోతే కర్మం చుట్టుకొన్నట్లు
|
| ధర్మో రక్షతి రక్షితః
|
| ధాష్టీకపు ముష్టి
|
| ధాష్టీకానికి ధర్మం లేదు
|
| ధీరుడైనా కావాలి దీనుడైనా కావాలి
|
| ధూపం వేస్తే పాపం పోతుందా?
|
| ధైర్యం లేని రాజు - తెలివి లేని మంత్రి
|
| ధైర్యే సాహసే లక్ష్మీ
|