| శంఖులో పోస్తేగానీ తీర్థం కాదు
|
| శృంగారమంటే ఏ తీరో - ఏ విధమో చెప్పరా నా ముద్దుల ప్రియుడా అన్నదట
|
| శృంగారానికి సమయం - సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లు
|
| శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు
|
| శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు
|
| శతమర్కటం పితలాటకం అన్నట్లు
|
| శతాపరాధములకు సహస్ర దండనలు
|
| శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు
|
| శనిపడితే ఏడేళ్ళు - నేను పడితే పధ్నాలుగేళ్ళు
|
| శనిపీనుగు ఒంటరిగా పోదు
|
| శని విరగడయితే చాలు అన్నట్లు
|
| శనేశ్వరానికి నిద్రెక్కువ - దరిద్రానికి ఆకలెక్కువ
|
| శల్యపరీక్ష చేసినట్లు
|
| శల్య సారథ్యం లాగా
|
| శవానికి చేసిన అలంకారం వలె
|
| శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు
|
శాస్త్రులవారింట పుట్టాను, సోమయాజుల వారింట మెట్టాను,
లవణమంటే దూడ రేణమని తెలీదా నాకు అన్నదట
|
| శివరాత్రికి చింతాకంత చెమట
|
| శివరాత్రికి శివ లింగాలంత మామిడికాయలు
|
| శివరాత్రితో చలి శివ శివా అంటుంది
|
| శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు
|
| శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానం
|
| శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండెక్కడన్నాడట
|
| శుభస్య శీఘ్రం
|
| శుష్క ప్రియాలు - శూన్య హస్తాలు
|
| శూద్ర సంతర్పణ - బ్రాహ్మణ సేద్యం
|
| శృంగారానికి సమయ సందర్భాలు అక్కరలేదన్నట్లు
|
| శృంగారానికి సిగ్గూ - ముద్దుకు బుద్ధీ లేవన్నట్లు
|
| శేరుకు సవాశేరు
|
| శొంఠిలేని కషాయం ఉంటుందా?
|
| శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లు
|
| శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పు
|
| శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లు
|
| శోభనాల వేళ - సురాలోక మార్గం అన్నట్లు
|
| శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లు
|
| శ్మశాన వైరాగ్యం - ప్రసూతి వైరాగ్యం
|
| శ్రాద్ధాని కంటులేదు - యజ్ఞానికి ఎంగిలిలేదు
|
| శ్రావణంలో శనగల జోరు - భాద్రపదంలో బాధల పోరు
|
| శ్రీరంగనీతులు చెపుతాం ఆచరించండి అన్నట్లు
|
| శ్రీరామరక్ష నూరేళ్ళాయుష్షు
|
| శ్రీరామరక్ష - సర్వ జగద్రక్ష
|
| శ్రుతిమించి రాగాన పడినట్లు
|
| శ్వాస వుండే వరకూ ఆశ ఉంటుంది
|
| షండుడికి రంభ దొరికితే ఏమవుతుంది?
|
| షష్ఠిపూర్తినాడు పక్కింటావిడకి కన్నుకొట్టినట్లు
|
| సంకటకాలే వేంకటరమణ అన్నట్లు
|
| సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి
|
| సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోనివారూ బయటకు వస్తారు
|
| సంక్రాంతి సాలు కొకసారే
|
| సంగీతము చేత బేర సారము లుడిగెన్
|
| సంఘ భయం - పాప భయం
|
| సంజయ రాయబారంలాగా
|
| సంచిలాభం చిల్లు కూడదీసింది
|
| సంతకు వెళ్ళొచ్చిన ముఖంలాగా
|
| సంత మెరుగు సాని ఎరుగును
|
| సంతలో కొడితే సాక్షులెవరు?
|
| సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం చేస్తే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడిపోయిందట
|
| సంతోషం సగం బలం
|
| సంతోషానికి సాకు - ఆలోచనకు ఆకృతి లేదు
|
| సందడిలో సడేమియా అన్నట్లు
|
| సందడిలో సందడి - పనిలో పని
|
| సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు
|
| సందేహాలన్నీ దేహాలతో తీర్చుకున్నట్లు
|
| సంపదలో మరుపులు - ఆపదలో అరుపులు
|
| సంపదలో మరుపులు - ఆపదలో మ్రొక్కులు
|
| సంపద, సాని రెండూ నిలకడగా వుండవు
|
| సంపెంగల సంతలో ఒయ్యారాల విందులన్నట్లు
|
| సంపాదన ఒకరిది - అనుభవం ఇంకొకరిది
|
| సంసారం గుట్టు - జబ్బు రట్టు
|
| సంసారం జానెడు - ఖర్చు బారెడు
|
| సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే బూడిద, బుర్రకాయ గాడిద బరువైనాయట
|
| సంసారి తిరిగి, సన్యాసి తిరగక చెడతారు
|
| సంసారి సైయ్‌ఁ - సన్యాసి సైయ్‌ఁ అన్నాడట ఆకలితో చచ్చే సన్యాసి
|
| సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టు
|
| సకల గుణాభిరాముడు
|
| సకల శాస్త్రాలు - నిలబడి మూత్రాలూ
|
| సగం పెట్టి మేనత్త అన్నట్లు
|
| సగం సాలె నేత, సగం మాలనేత
|
| సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతూంటే, అసత్యం ప్రపంచమంతా చుట్టి వస్తుంది
|
| సత్యం నావద్ద దండిగా వుంది, చెప్పులు తేరా మగడా! నిప్పులో దూకుతా అందట
|
| సత్రం కూటికి అయ్యగారి ఆజ్ఞా!
|
| సత్రం భోజనం - మఠం నిద్ర
|
| సన్నమో ముతకో సంతలో తేలిపోతుంది
|
| సన్నసన్నగా కాపుతనం వచ్చింది - సన్న బియ్యం వండవే పెళ్ళామా అన్నాట్ట
|
| సన్నెకల్లు దాస్తే పెళ్ళాగుతుందా?
|
| సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు తప్పలేదు
|
| సన్యాసికి దొంగల భయమేమి?
|
| సన్యాసి పెళ్ళాం విధవా కాదు పునిస్త్రీ కాదు
|
| సన్యాసి పెళ్ళికి జుట్టునుంచీ అరువే
|
| సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుంది
|
| సన్యాసుల మధ్య కల్లుముంతలు మాయమైనట్లు
|
| సభా పిరికిదానా! ఇంటిలో లేడని చెప్పవే అని అన్నాడట
|
| సమయం తప్పితే కాళ్ళు - సమయం వస్తే రాళ్ళు
|
| సమయానికి రానిది చంక నాకనా?
|
| సముద్రం మధ్యన వున్నా మంచినీళ్ళు కరువే
|
| సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరు
|
| సముద్రంలో కాకి రెట్టలాగా
|
| సముద్రంలో నీటి బొట్టులాగా
|
| సముద్రంలో వానపడినట్లు
|
| సముద్రానికి ఏతాము వేసినట్లు
|
| సరదాకి సమర్తాడితే చాకలిది చీర, రవిక లాక్కున్నదట
|
| సరసము విరసము కొరకే
|
| సరసానికి వస్తావా సొగసుల మధురిమ చూపిస్తా అందిట
|
| సరసానికి రారా మగడా అంటే మూడంకె వేస్తాడన్నట్లు
|
| సరసానికైనా సమయం వుండాలి
|
| సరాగాలకు సై అంటే తీగలా నన్ను చుట్టుకుని అందాలన్నిటినీ ఆరేసుకుంటా అందిట
|
| సరిపడనివారు చచ్చినవారితో సమానం
|
| సర్వేజనా స్సుఖినో భవన్తు
|
| సవతులున్న ఇల్లు నరక సమానం
|
| సవాశేరులో బోడి పరాచకమా?
|
| సర్కారుకు చాటుగానూ, షావుకారికి ఎదురుగానూ వుండాలి
|
| సహనం కంటే సముద్రం చిన్నది
|
| సహనం ముందు లోకం గుప్పెడే
|
| సహనం కలవాడికి ఎదురే లేదు
|
| సహనముంటే పశ్చాత్తాపానికి చోటేలేదు
|
| సాగితే రంకు - సాగకపోతే బొంకు
|
| సాగితే సాగించుకోమన్నారు
|
| సాగినమ్మ చాకలాడితో పోతే అదొక వ్రతమనుకొన్నారట
|
| సాతాని జుట్టుకు, సన్నాసి పిలక్కు ముడివేసినట్లు
|
| సాతాని పీకులాటలాగా
|
| సానికి రంకులు నేర్పాలా?
|
| సాని నీతి, సన్యాసి జాతి తెలియవు
|
| సాము నేర్చినవానికే చావు గండం
|
| సామెతలేని మాట - ఆమెత లేని ఇల్లు
|
| సామెతల మాట - విందు వినోదాల పొందు
|
| సాయిబు గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్ట అంటించుకోను నిప్పు అడిగినట్లు
|
| సాయిబు సంపాదన బూబు కుట్టుకూలికే సరి
|
| సాలెవాడి భార్య సరి మీద పడింది
|
| సాలెవాని ఎంగిలి ముప్పై కోట్ల దేవతలు మెచ్చారు
|
| సాలెవానికీ కోతిపిల్లకూ తగులాటమైనట్లు
|
| సాక్షికాళ్ళు పట్టుకోవడంకన్నా వాదికాళ్ళు పట్టుకోవడం మేలు
|
| సింగారం చూడరా నా బంగారు మగడా అన్నట్లు
|
| సిగ్గు చాటెడు - చెప్పులు మూటెడు
|
| సిగ్గు చెడ్డా ఫలితం దక్కాలి
|
| సిగ్గు మొగ్గ వేస్తే శృంగారం - మొగ్గ సిగ్గు విడిస్తే మందారం అన్నట్లు
|
| సిగ్గు సుకుమారమైంది
|
| సిగ్గుల పరిధికి అంతం - అందాల రక్తికి ఆరంభం పడకటింటిపడకే అన్నట్లు
|
| సిగ్గులేని ముఖానికి చిరునవ్వే అలంకారం
|
| సిగ్గు విడిస్తే చింతెందుకు?
|
| సిగ్గు విడిస్తే శ్రీరంగం అన్నట్లు
|
| సిగ్గే స్త్రీకి అలంకారం
|
| సిరికొద్దీ చిన్నెలు - మగనికొద్దీ వన్నెలు
|
| సిరిపోయినా చిన్నెలు పోలేదు
|
| సిరిమల్లె పూలెట్టి గదిలో కొస్తే సిగ్గెంతో కొలవాల్సిందే అన్నాడట
|
| సిరిరా మోకాలొడ్డు వారుంటారా?
|
| సీత పుట్టుక లంకకు చేటు
|
| సీతాపతీ! నీకు చాపేగతి
|
| సుందరాంగి చూపుకన్నా సోకు లేదన్నట్లు
|
| సుఖం మరిగినమ్మకు మొగుడి కష్టమేం తెలుస్తుంది?
|
| సుఖం మరిగిన దాసరి పదం మరిచాడట
|
| సుతారం - సువ్వారం బొగ్గులు గానూ
|
| సుతులు లేనివారికి గతులు లేవు
|
| సున్నం కొడితేగానీ శుద్ధిగాదు
|
| సున్నకి సున్న - హళ్ళికి హళ్ళి
|
| సుపుత్రా కొంప పీకరా!
|
| సుబ్బలక్ష్మి మొగుడు సుందరాంగుడు - అమ్మణ్ణి మొగుడు అనాకారుడు అన్నట్లు
|
| సూడిద బూడిదపాలు - ఇల్లాలు యితరుల పాలు
|
| సూదిని తీసుకెళ్ళి దూలానికి గ్రుచ్చినట్లు
|
| సూది పోయిందని సోదెకు వెడితే పాతరంకులు బయట పడ్డాయట
|
| సూది గొంతు - బాన కడుపు
|
| సూదిలా వచ్చి పలుగులా తయారైనట్లు
|
| సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖానే పడుతుంది
|
| సూర్యుని ముందు దివిటీలాగా
|
| సూక్ష్మంలో మోక్షం అన్నట్లు
|
| సృష్టి రహస్యం శోభనం గదిలో తెలిసినట్లు
|
| సెగ లేనిదే పొగరాదు
|
| సెట్టిగారి బ్రతుకు చచ్చిన తరువాత తెలుస్తుంది
|
| సెట్టి వీసెడు - లింగం మణుగు
|
| సేవలు పూజ్యం - మాటలు బహుళం
|
| సైంధవుడిలాగా అడ్డుపడినట్లు
|
| సొంతానికి ఏనుగు - ఉమ్మడికి పీనుగు
|
| సొగసుల తాయిలం పెదాలతో అందించినట్లు
|
| సొగసుల నైవేద్యం - పెదవుల తాంబూలం
|
| సొమ్ము పోయేటప్పుడు, దెబ్బ తగిలినప్పుడూ మతి ఉండదు
|
| సొమ్మొక చోట - అనుమాన మొకచోట
|
| సొమ్మొకడిది - సోకొకడిది
|
| సొమ్ము సొమ్ముగా వుండాలి - బిడ్డలు గుండ్రాళ్ళలాగా వుండాలి
|
| సొమ్మేమి సాక్ష్యం - మనిషేమి పావనం?
|
| సోకుమొక్కు సందకాడ తీర్చమన్నట్లు
|
| సోమరి సమాజానికి బరువు
|
| సోమరికి షోకులెక్కువ
|
| సోయగాల విందుకు వేళాపాళాలేదు రమ్మందట
|
| సౌందర్యం నశ్వరం - సౌశీల్యం శాశ్వతం
|
| స్త్రీ చిత్తం - పురుషుడి భాగ్యం
|
| స్థాన బలిమి కాని తన బలిమి కాదు
|
| స్నానానికి ముందుండకూడదు, సంభావనకు వెనకుండకూడదు
|
| స్వకార్య ధురంధరుడు - స్వామికార్య వంచకుడు
|
| స్వకుచ మర్దనం
|
| స్వగృహే పూర్ణమాచారం
|
| స్వయంరాజా - స్వయం మంత్రీ
|
| స్వర్గానికి పోయినా సవతి పోరు తప్పలేదన్నట్లు
|
| స్వర్గారోహణపర్వం చదువుతున్నట్లు
|
| స్వాతి కురిస్తే చట్రాయికూడా పండుతుంది
|
| స్వాతి కురిస్తే భీతి
|
| స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి
|
| స్వాతివాన ముత్యపువాన
|
| స్వాతివానకు సముద్రాలు నిండుతాయి
|
| స్వాతీ నేను జరుపుకు వస్తాను, విశాఖా నీవు విసురుకురా!
|
| స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు
|
| షష్టినాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు
|
| హంగామాల పెళ్ళాం - ఆర్భాటాల మొగుడు
|
| హంస నడకలు రాకపోయే - ఉన్న నడకలు మరిచిపోయే
|
| హద్దుల్లో వుంటేనే ముద్దూ ముచ్చటా
|
| హద్దుల్లో వుంటేనే ఆడది - హద్దు దాటితే గాడిద
|
| హనుమంతుని ముందు కుప్పిగంతులా?
|
| హరిదాసుకందరూ తనవారే
|
| హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు - నా నోట నిజం రాదు
|
| హరిశ్చంద్రునికి వారసుడన్నట్లు
|
| హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన
|
| హస్తకు ఆదిపంట - చిత్తకు చివరి పంట
|
| హస్తకు ఆరుపాళ్ళు - చిత్తకు మూడుపాళ్ళు
|
| హస్త, చిత్తలు వరుపయితే అందరి సేద్యం ఒక్కటే
|
| హస్తలో అడ్డెడు చల్లేకంటే చిత్తలో చిటికెడు చల్లటం మేలు
|
| హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు
|
| హస్తలో చల్లితే హస్తంలోకి రావు
|
| హాజరు జవాబు - అదే పోతే
|
| హాస్యగానికి తేలు కుట్టినట్లు
|
| హీనకాంతి దీపం యింటికి చేటు - మొగమాటపు పెళ్ళాం మొగుడికి చేటు
|
| హేతువు లేకుండా తీతువు కూయదు
|
| హేమా హేమీల్లాగా
|
| హేమా హేమీలు ఏట్లో కొట్టుకుపోతుంటే, నక్క పాటిరేవడిగిందట
|
| క్షణం చిత్తం - క్షణం మాయ
|
| క్షవర కళ్యాణంలాగా
|
| క్షణం తీరిక లేదు - దమ్మిడీ ఆదా లేదు
|
| క్షామానికి జొన్న - వర్షానికి వరి పండుతాయి
|
| క్షేత్రమెరిగి విత్తనం వేయాలి
|
| క్షేమంగా పోయి లాభంగా రా!
|
| క్షేమం కోరితే క్షామం లేదు
|
| క్షేమ సమాచారాలడిగినట్లు
|