| బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి
|
| బంగారానికి తావి అబ్బినట్లు
|
| బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దు
|
| బందరు లడ్డూలాగా
|
| బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?
|
| బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు
|
| బంధువులకు దూరం - బావికి దగ్గర
|
| బంధువులంతా ఒక దిక్కు - బావమరిది ఇంకొక దిక్కు
|
| బక్క ప్రాణం - కుక్క చావు
|
| బట్టతలకూ - మోకాళ్ళకూ ముడి వేసినట్లు
|
| బట్టతలమ్మకు పాపిట తీయమన్నట్లు
|
| బట్టలిప్పి నీళ్ళు పోసుకుంటూ బావగారు వచ్చారని సిగ్గుతో చేతులెత్తి నుంచున్నదట
|
| బడాయి బండెడు - బ్రతుకు తట్టెడు
|
| బతకలేక బడిపంతులు
|
| బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట
|
| బతికి చెడినవారితో వుండొచ్చుకానీ చెడి బతికిన వారితో వుండరాదు
|
| బతికి చెడినవాడి బాధలు చూడు - చెడి బతికిన వాడి చేష్టలు చూడు
|
| బతికి పట్నం - చచ్చి స్వర్గం చూడాలి
|
| బతుకంత భయం లేదు - చావంత కష్టం లేదు
|
| బతుకులెన్నాళ్ళు - భాగ్యాలెన్నాళ్ళు?
|
| బద్ధకస్తుడికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువ
|
| బయట తన్ని, యింట్లో కాళ్ళు పట్టుకున్నట్లు
|
| బయట పులి - ఇంట్లో పిల్లి
|
| బయటొక మాట - లోపల యింకో మాట
|
| బరితెగించిన వాడు బజారుకు పెద్ద
|
| బర్రె చస్తే పాడి బయటపడుతుంది
|
| బర్రె, దూడ వుండగా గుంజకేలరా గురక రోగం?
|
| బలం ఉడిగినా పంతం ఉడగదు
|
| బలపం పట్టి భామవొళ్ళో ఓనమాలు దిద్దినట్లు
|
| బలవంతపు బ్రాహ్మణార్థం
|
| బల్ల క్రింద చేతులు
|
| బల్లి పడిందని బావ ప్రక్కలో దూరినట్లు
|
| బసవదేవునికి బడితె పూజ
|
| బాదరాయణ సంబంధం
|
| బాధకొక కాలం - భాగ్యానికొక కాలం
|
| బాపన సేద్యం బత్తెం నష్టం
|
| బాపన సేద్యం బత్తెం చేటు - కాపుల చదువులు కాసుల చేటు
|
| బాపని సేద్యం బతకటానికీ రాదు - చావటానికీ రాదు
|
| బాల జ్యోతిష్యం - వృద్ధ వైద్యం
|
| బాలవాక్కు బ్రహ్మ వాక్కు
|
| బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు
|
| బావకు మరదలు పిల్లపై ఆశ
|
| బావా! అంటే, ప్రక్కలోకి రావా! అన్నాడట
|
| బావా! అని చూడబోతే, రావా? అని కొంగు లాగాడుట
|
| బావి లోతు తెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదు
|
| బాహువుల పందిరిలో అధరాల ఆరాటం అందాల విందుకోసం అన్నట్లు
|
| బిగికౌగిలి పొదరింట పరువాల విందులన్నట్లు
|
| బిచ్చగాణ్ణి పొమ్మన్నా, ఉండమన్నా అత్తే చెప్పాలి
|
| బిచ్చానికి పోయినా బిగువు తగ్గలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు
|
| బిడ్డ చచ్చినా ఉయ్యాల మీద తీపి పోలేదు
|
| బిడ్డ చచ్చినా పీతికంపు పోలేదు
|
| బిడ్డను దించి లోతు చూచినట్లు
|
| బిడ్డలను కన్నమ్మా - భిక్షం వేసినమ్మా చెడరు
|
| బిడ్డ వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళ
|
| బీద కూటికి గానీ గుణానికి గారు
|
| బీదైన మాత్రాన బింకం పోతుందా?
|
| బుట్టలో కాపురం బూడిద పాలైనట్లు
|
| బుట్టలో పేలాలు వేయించినట్లు
|
| బుడ్డను నమ్ముకొని ఏట్లో దిగినట్లు
|
| బుధవారం పుట్టిన ఎద్దు భూమిని దున్నినా, త్రొక్కినా భూమి పొర్లి పొర్లి పండుతుంది
|
| బుధవారంనాడు పులికూడా వేటకు రాదు
|
| బుద్ధి భూమినేలుతూంటే రాత గాడిదలు కాస్తోంది
|
| బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు
|
| బురద గుంటలో పందిలాగా
|
| బులుపు తీరితే గానీ బుద్ధిరాదు
|
| బూడిదలో పోసిన పన్నీరు
|
| బూతు లేనిదే నీతి లేదు
|
| బెల్లం వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ
|
| బెల్లమున్నచోటే ఈగలు
|
| బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం
|
| బెల్లం ఉన్నంతసేపే ఈగలు - సిరి వున్నంతసేపే బలగం
|
| బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా
|
| బేరం చేస్తూ బ్లౌజు కొలతలడిగినట్లు
|
| బొంకు నేర్చి రంకు నేర్వాలి
|
| బొక్కలు పూడ్చి తూపులు తెరిచినట్లు
|
| బొగ్గుల్లో మాణిక్యంలాగా
|
| బొమ్మకు మ్రొక్కినా నమ్మకముండాలి
|
| బొల్లెద్దుకు ముఖమే సాక్షి
|
| బోగందాని చళ్ళకూ, సంతలో సొరకాయలుకూ గోటిగాట్లు ఎక్కువ
|
| బోడిగుండుకు బొడ్డుమల్లెలు
|
| బోడినెత్తిన కొబ్బరికాయ కొట్టినట్లు
|
| బోడి పెత్తనం
|
| బోనులో పడ్డ సింహంలాగా
|
| బోగందానికి ఒక మగడా?
|
| బోడి గుండంత సుఖం లేదు - ఊరుకున్నంత ఉత్తమం లేదు
|
| బోసి నోటికి పేలపిండి ప్రీతి
|
| బ్రతకని బిడ్డ బారెడు
|
| బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు
|
| బ్రతికితే వైద్యుడు బ్రతుకుతాడు - చస్తే బ్రాహ్మణుడు బ్రతుకుతాడు
|
| బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది
|
| బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట
|
| బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
|
| బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు
|
| బ్రహ్మచారీ శతమర్కటః
|
| బ్రహ్మజ్ఞానుల వారు వచ్చారు, పట్టుబట్టలు జాగ్రత్త అన్నట్లు
|
| బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొదవా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదవా?
|
| బ్రాహ్మణుడి ఆచారం నీటి కొద్దీ
|
| బ్రాహ్మణుడి నోరు, ఏనుగు తొండం వూరుకోవు
|
| బ్రాహ్మణుడికి పప్పాశ - అల్లుడికి అత్తాశ
|
| భంగు తాగేవారికి హంగుగాళ్ళు పదిమంది
|
| భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు
|
| భక్తి లేని పూజ పత్రి చేటు
|
| భగీరథ ప్రయత్నం
|
| భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి
|
| భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి
|
| భరణి కురిస్తే ధరణి పండును
|
| భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట
|
| భరణిలో పుడితే ధరణిని ఏలు
|
| భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకం
|
| భాగ్యముంటే బంగారం తింటారా?
|
| భాంచేత్ దేవుడికి మాదర్చేత్ పత్రి
|
| భార్యా రూపవతీ శత్రుః
|
| భాషకు తగిన వేషం - ఈడుకు తగిన ఆచారం
|
| భాషలు వేరైనా భావమొక్కటే
|
| భూదేవంత ఓర్పుండాలి
|
| భూమినీ రాజునీ కొలిచినవాడు చెడడు
|
| భూతాలకి చింత బరికెలు
|
| భోజనానికి ముందు - వేడినీళ్ళకు వెనుక
|
| భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు
|
| భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకుని వస్తానన్నట్లు
|
| భోజనానికి పిలిస్తే రాకుండా దొడ్డిదారిన వచ్చి రోలు నాకినట్లు
|
| భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు
|