| చంక బిడ్డకు దండం అన్నట్లు
|
| చంకన పిల్ల - కడుపులో పిల్ల
|
| చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు
|
| చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు
|
| చందాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు
|
| చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్లు
|
| చంద్రునికో నూలుపోగు
|
| చక్కదనానికి లొట్టిపిట్ట - సంగీతానికి గాడిద
|
| చక్కనమ్మ చిక్కినా అందమే - సన్న చీర మాసినా అందమే
|
| చక్కని రాజమార్గం వుండగా గోడలు దూకట మెందుకు?
|
| చక్కనైన చుక్క కోసం లెక్కలేని యిక్కట్లన్నట్లు
|
| చక్రవర్తి చేస్తే శృంగారం - చాకలాడు చేస్తే వ్యభిచారం
|
| చచ్చిన తరువాత తెలుస్తుంది శెట్టిగారి బండారం
|
| చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళ క్రింద
|
| చచ్చిన పామును కొట్టటానికి అందరూ మొగాళ్ళే
|
| చచ్చిన పామును కొట్టినట్లు
|
| చచ్చిన బిడ్డకు బారడేసి కండ్లు
|
| చచ్చినవాడి పెండ్లికి వచ్చిందే కట్నం
|
| చచ్చినా పంచాంగం బ్రాహ్మణుడు వదలడు
|
| చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్లు
|
| చచ్చేదాకా బ్రతికితే పెళ్ళి చేస్తామన్నట్లు
|
| చచ్చేదాకా వైద్యుడు వదలడు
|
| చచ్చే రోగికి మందు పట్టదు
|
| చదవేస్తే ఉన్న మతి పోయిందట
|
| చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం
|
| చదివిన వాడికన్నా చాకలాడు మేలు - చాకలాడికన్నా మేకలాడు మేలు
|
| చదువక ముందు కాకర కాయ - చదివిన తర్వాత కీకరకాయ
|
| చదువా లేదు - మరువా లేదు
|
| చదువరి మతికన్నా చాకలి మతి మేలు
|
| చదువుకు ముదురు - సాముకు లేత
|
| చదువు చన్ను విడిచి చన్ను పట్టుకునే లోపలే రావాలి
|
| చదువు చారెడు - బలపాలు దోసెడు
|
| చదువు మా యింటా వంటా లేదు
|
| చదువురాని మొద్దు - కదలలేని ఎద్దు
|
| చదువు సన్నమయ్యె - అయ్య లావయ్యె
|
| చదువూ లేదు - సంధ్యా లేదు
|
| చద్దికంటే ఊరగాయ నయం
|
| చద్దికూడు తిన్నమ్మ మగడి ఆకలి ఎరుగదు
|
| చద్దిమూటలో సారం చాకలెరుగును
|
| చనువిస్తే చంక కెక్కినట్లు
|
| చన్ను కుడిచి రొమ్ము గుద్దినట్లు
|
| చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు
|
| చప్పిడి చేస్తే జబ్బు కుదురుతుంది
|
| చమురు దండుగ భాగవతం
|
| చలికి జడిసి కుంపటి ఎత్తుకున్నట్లు
|
| చలిరాత్రి విరహాలకు కౌగిళ్ళే దుప్పట్లు అన్నట్లు
|
| చల్ల ఎట్లా వున్నయిరా అంటే చల్లకన్నా గొల్లదే బావుంది అన్నాట్ట
|
| చల్ల కుండకు, చంటి బిడ్డకు చాటుండాలి
|
| చల్లకు వచ్చి ముంత దాచినట్లు
|
| చళ్ళు జారిన ముండకు వట్టలు జారిన విటుడు
|
| చవీ సారంలేని కూడు చట్టినిండా - మొగతనం లేని మొగుడు మంచంనిండా
|
| చవుక కొన నీయదు - ప్రియం అమ్మనీయదు
|
| చస్తే గానీ బర్రెపాడి బయటపడదు
|
| చాకలి కొత్త -మంగలి పాత
|
| చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప అయ్యవద్ద పసేంలేదు
|
| చాకలిది సందె ఎరుగదు - మాలది మంచమెరుగదు
|
| చాకలి-మంగలి పొత్తు - ఇంటికి రాదు సొత్తు
|
| చాకలి వాడు ఏ రేవున వుతికితేనేం?
|
| చాదస్తపు మొగుడు చెపితే వినడు - చెప్పకపోతే కరుస్తాడు
|
| చాలని బట్ట కొంటే చినిగేవరకూ దుఃఖం - చాలని మగడిని చేసుకుంటే చచ్చేవరకూ దుఃఖం
|
| చాలుపై చాలు దున్నితే చచ్చుచేనైనా పండుతుంది
|
| చావా చావడు ప్రాణాలు తీస్తున్నాడన్నట్లు
|
| చావుకంటే గండం లేదు
|
| చావు కబురు చల్లగా చెప్పమన్నారు
|
| చావుకు చావుందా?
|
| చావు కాలానికి సమర్త కట్నాలు
|
| చావుకు పెడితే గానీ లంఖణాలకు దిగడు
|
| చావుకు ముదురు, లేతా వుంటాయా?
|
| చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు
|
| చింతకాయలమ్మేదానికి సిరిమానమొస్తే, చింతకాయను చూసి టుంకిరి బింకిరికాయ ఇదేమి కాయ అన్నదట
|
| చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు
|
| చింతకాయలు బేరం చేస్తూ వంకాయల్ని ఏరినట్లు
|
| చింత చెట్టు టూటిందంటే టూటేకాలమొస్తే టూటదా అన్నదట
|
| చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట
|
| చింతాకంత బంగారంతో మెడచుట్టూ గొలుసు కావాలన్నట్లు
|
| చిక్కితే దొంగ - చిక్కకుంటే దొర
|
| చిక్కినవాడు సిగ్గెరుగడు - బలిసిన వాడు వావి ఎరుగడు
|
| చిక్కినవానికి సిగ్గేమిటి?
|
| చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి
|
| చిచ్చు అంటుకొంటే చేతులతో ఆర్పగలమా?
|
| చిచ్చును ఒడినికట్టి తెచ్చినట్లు
|
| చిటికెలతో పందిరి వేసినట్లు
|
| చితి చచ్చినవాణ్నీ, చింత బ్రతికిన వాణ్నీ కాలుస్తుంది
|
| చిత్తం చెప్పుల మీద - భక్తి శివుడి మీద
|
| చిత్తం మంచిదయితే వూరూ మంచిదవుతుంది
|
| చిత్తం వనితల మీద - ధ్యానం దేవుడి మీద
|
| చిత్త ఎండకు పిట్టల తలలు పగుల్తాయి
|
| చిత్తకార్తె కుక్కలాగా
|
| చిత్త కురిస్తే చింతలు కాస్తాయి
|
| చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పంటిస్తాను అంటుంది వరి
|
| చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న
|
| చిత్త చినుకు తన యిష్టమున్న చోట పడుతుంది
|
| చిత్త జల్లు - చిత్త ఉబ్బ
|
| చిత్త జల్లు - స్వాతి వాన
|
| చిత్తకు చిరుపొట్ట వరికి
|
| చిత్తరువుకు జీవం వచ్చినట్లు
|
| చిత్తలో చల్లితే చిట్టెడు కాపు
|
| చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు
|
| చిత్తశుద్ధిలేని శివపూజ లెందుకు?
|
| చిత్త, స్వాతీ సంధించినట్లు
|
| చిత్త స్వాతులు చిత్తగించి విశాఖ విసురుతే మొదలు తంతే ఏడు గింజలు రాలుతాయి
|
| చిదంబర రహస్యం
|
| చివికి చివికి గాలివాన అయినట్లు
|
| చినుకులకు చెరువు నిండుతుందా?
|
| చిన్న యిల్లు - పెద్దకాపురం
|
| చిన్ననోటికి పెద్దమాట
|
| చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి
|
| చిన్నమ్మ సింహద్వారాన వస్తే - పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది
|
| చిన్నవాళ్ళు తింటే చిరుతిండి - పెద్దవాళ్ళు తింటే ఫలహారం
|
| చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష
|
| చిమడకే చిమడకే ఓ చింతకాయా! నీవెంత చిమిడినా నీ పులుపు పోదే!
|
| చిలకకు చెప్పినట్లు
|
| చిలిపి వూహల వయ్యారికి చిలిపిదనాల శృంగారం అన్నట్లు
|
| చిలుం పట్టేవాడికి చిత్తం కుదరదు
|
| చిలుం వదిలితేగానీ ఫలం దక్కదు
|
| చిలుం వదిలిస్తే గానీ చీద్రం వదలదు
|
| చిలుకపోతే పంజరం ఎందుకు?
|
| చిల్లర దేవుళ్ళలాగా
|
| చిల్లర శ్రీమహాలక్ష్మి
|
| చిల్లి బాగాలేదని బెజ్జం వేసినట్లు
|
| చీకటింట్లో చిందులు వేసినట్లు
|
| చీకటి కొన్నాళ్ళు వెలుతురు కొన్నాళ్ళు
|
| చీకితే లేనిది నాకితే వస్తుందా?
|
| చీటీకి ప్రాణం ప్రాలు
|
| చీడ అంటుతుందిగానీ, సిరి అంటదు
|
| చీడ సిగ్గెరుగదు
|
| చీద్రానికి చీరపేలు - దారిద్ర్యానికి తలపేలు
|
| చీదితే ఊడే ముక్కు తుమ్మితే నిలుస్తుందా?
|
| చీమ ఒళ్ళు చీమకు బరువు - ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు
|
| చీమలు చెట్టెక్కితే భూములు పండుతాయి
|
| చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలు
|
| చీర కట్టినమ్మ శృంగారం చూడు - గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు
|
| చీరకు, రవికకు చిక్కని సిగ్గే ఫలహారం అందట
|
| చీర సింగారించేటప్పటికి ఊరు మాటు మణిగింది
|
| చీరకు సిగ్గులు - రవికకు ముద్దులు నేర్పినట్లు
|
| చీరే శృంగారం స్త్రీకి
|
| చుట్టం ఆకలి దేవుడెరుగు
|
| చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకున్నట్లు
|
| చుట్టం వచ్చాడు అంటే, చెప్పులెక్కడ వదిలాడో చూడు అన్నట్లు
|
| చుట్టతాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట
|
| చుట్టరికం, పేదరికం కలిసివచ్చినట్లు
|
| చుట్టలకు పెట్టినిల్లు చూరబోయింది - వేల్పులకు పెట్టినిల్లు హెచ్చిపోయింది
|
| చుట్టు అయినా సులువు దారే మంచిది
|
| చుట్టుకుంటే ఆడదాన్నే చుట్టుకోవాలి - పంచుకుంటే అతివ అందాలనే పంచుకోవాలి
|
| చుట్టూ చూరు మంగళం - నడుమ జయమంగళం
|
| చుట్టూ శ్రీవైష్ణవులే - కల్లుకుండ కనబడటం లేదు
|
| చూపుడాబేగానీ చేతడాబు లేదు
|
| చూపులకు కడుపులొస్తాయా? ముద్దులతో ఆకలి తీరుతుందా?
|
| చూసి మురుసుకొని - చెప్పి ఏడ్చుకొని
|
| చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు
|
| చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి - చేసేవారుంటే పిల్లల్ని కనాలి
|
| చూడ చుట్టము లేదు - మ్రొక్క దైవము లేదు
|
| చూడబోతే చుట్టాలు - రమ్మంటే కోపాలు
|
| చూడవమ్మ సుతారం - ఇంటావిడ అవతారం
|
| చూపితే మానం పోయె - చూపకపోతే ప్రాణం పోయె
|
| చూపుల గుర్రం
|
| చూపులకు సుందరి - మాటలకు మంధర
|
| చూపులకే ఆబోతు రూపం - పనిలో నీరసాలరాజు
|
| చూపులకే కడుపొస్తే మొగుడెందుకు అందిట
|
| చూపుల మగవాడే కానీ - సుఖాల మగడు కాదు అన్నట్లు
|
| చూపుల పసే గానీ చేతల పసలేదన్నట్లు
|
| చూపులో చుక్కలు -కోకలో సోకులు
|
| చూపే శృంగారం - ఊపే వయ్యారం
|
| చూరుకత్తి తెగుతుంది కానీ చూపుకత్తి తెగుతుందా?
|
| చూసి త్రొక్కు - తెలిసి మ్రొక్కు
|
| చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిందట
|
| చూస్తే చుక్క - లేస్తే కుక్క
|
| చూస్తే నీది - లేకుంటే నాది
|
| చూస్తే పొరపాటు - చూడకుంటే గ్రహపాటు
|
| చెంబు అమ్మి తపేలా - తపేలా అమ్మి చెంబు
|
| చెంప నొక్కుడుకన్నా కౌగిలింతే కమ్మగా వుందన్నదట
|
| చెట్టుంటే చెద వుంటుంది
|
| చెట్టు ఎక్కేవాడికి ఎంతదాకా ఎక్కుడు మెట్లు పెట్టగలం?
|
| చెట్టు ఎక్కనిచ్చి నిచ్చెన తీసినట్లు
|
| చెట్టు చచ్చినా చేవ చావదు
|
| చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు
|
| చెక్కకపోతే దిమ్మ - చెక్కితే బొమ్మ - గుళ్ళో వుంటే అమ్మ అన్నట్లు
|
| చెట్టు నాటేదొకడు - ఫలం అనుభవించే దొకడు
|
| చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి మీద పడ్డట్లు
|
| చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు
|
| చెట్టునుబట్టే కాయ
|
| చెట్టులేని చేను - చుట్టాలు లేని ఊరు
|
| చెట్టెక్కి చేతులు విడిచినట్లు
|
| చెడదున్ని శనగలు చల్లమన్నారు
|
| చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి అన్నట్లు
|
చెడిన కాపురానికి ముప్పేమిటి? చంద్రకాంతలు వండవే పెళ్ళామా అంటే
అప్పుకి అంతేమిటి అవే వండుతాను మగడా అందట
|
| చెడిన చేనుకు ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?
|
| చెడిన శ్రాద్ధం చెడనే చెడింది - పిత్తరా పీట పగుల అన్నట్లు
|
| చెడినా, పడినా చేసుకున్న మొగుడు తప్పడు
|
| చెడినా శెట్టి శెట్టే - చినిగినా పట్టు పట్టే
|
| చెడి బ్రతికినమ్మ చేతలు చూడు - బ్రతికి చెడ్డమ్మ చేతులు చూడు
|
| చెడి స్నేహితుని ఇంటికి పోవచ్చుకానీ చెల్లెలింటికి పోరాదు
|
| చెడిన సొమ్ము చెరిసగం
|
| చెడుకాలానికి చెడు బుద్ధులు
|
| చెడుచెడుమనే వారేగానీ చేతిలో పెట్టేవారు లేరు
|
| చెన్నంపల్లి పంచాయతీ చెరిసగం
|
| చెప్పటం తేలిక - చేయటం కష్టం
|
| చెప్పటం కంటే చేయడం మేలు
|
| చెప్పి నేర్పినమాట మంచిమాట
|
| చెప్పింది చేయకు - చేసేది చెప్పకు
|
| చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో - మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో
|
| చెప్పితే సిగ్గు - దాస్తే రోగం
|
| చెప్పుక్రింద తేలులాగా
|
| చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం
|
| చెప్పుడు మాటలు చేటు
|
| చెప్పును పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు
|
| చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ పోరాదు
|
| చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళమీదే
|
| చెప్పులోని రాయి - చెవులోని జోరీగ
|
| చెప్పులోని రాయి - ఇంటిలోని పోరు ఒక్కటే
|
| చెప్పేవాడికి చేసేవాడు లోకువ
|
| చెప్పేవాడికి చాదస్తమయితే వినేవాడికి వివేకం ఉండొద్దా?
|
| చెప్పేవి నీతులు - తీసేవి గోతులు
|
| చెప్పేవి శ్రీరంగనీతులు - చేసేవి దొమ్మరి పనులు
|
| చెమటే చందనం - అధరమే అమృతం అన్నట్లు
|
| చెయ్యంగా లేంది చెపితే తీపరమా?
|
| చెయ్యి చూసి అవలక్షణ మనిపించుకున్నట్లు
|
| చెయ్యిని దాచుకుంటాం గానీ కులం దాచుకుంటామా?
|
| చెయ్యి పుచ్చుకు లాగితే రాలేదుగానీ రమ్మని చీటీ వ్రాశాట్ట
|
| చెరపటానికి చేతులు వస్తాయి గానీ నిలపడానికి చేతులు రావు
|
| చెరపకురా చెడేవు - ఉరకకురా పడేవు
|
| చెరకు తోటలో ఏనుగు పడట్లు
|
| చెరకు పిప్పికి ఈగలు మూగినట్లు
|
| చెరకు వంకరపోతే తీపి చెడుతుందా?
|
| చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్లు
|
| చెరువు ఓడు - ఊరు పాడు
|
| చెరువుకు గండిపడి నీళ్ళు పోతుంటే, పీత బొక్కలు పూడ్చినట్లు
|
| చెరువుకు చేరువ - చుట్టాలకు దూరం ఉండాలి
|
| చెరువు నిండితే కప్పలు చేరవా?
|
| చెరువు నిండితే కప్పలు చేరుతాయి
|
| చెరువు నిండితే కప్పలు - సంపదలోనే చుట్టాలు
|
| చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోవటం మానినట్లు
|
| చెరువు ముందు చలివేంద్రం పెట్టినట్లు
|
| చెరువులో వున్న గేదెను కొమ్ములు చూసి బేరమాడినట్లు
|
| చెలి మాట తేనెల వూట
|
| చెల్లని కాసుకు కాంతులు మెండు
|
| చెల్లని కాసూ - ఒల్లని మొగుడూ ఒక్కటే
|
| చెవి తెగిన మేకవలె
|
| చెవిటి చెన్నప్పా అంటే సెనగల మల్లప్పా అన్నట్లు
|
| చెవిటివానిముందు శంఖ మూదినట్లు
|
| చెవిటివాని ముందు శంఖమూదితే దాన్ని కొరకను నీ తాతలు దిగి రావాలన్నాడట
|
| చెవి దగ్గర కందిరీగలాగ
|
| చేటలో వెలగకాయల్లాగా
|
| చేటు కాలానికి చేటు బుద్ధులు
|
| చేటు మూడినట్లు
|
| చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట
|
| చేతకానమ్మకు రోష మెక్కువ
|
| చేతకానివాడికి చేష్టలు ఎక్కువ
|
| చేతలు శూన్యం - మాటలు బహుళం
|
| చేతికర్ర చేదోడు వాదోడు
|
| చేతికి గడియారం - ఇంట్లో పొడివారం
|
| చేతికి పట్టిన జిడ్డు లెక్కకు రాదు
|
| చేతి చమురు వదిలినట్లు
|
| చేతిలో వుంటేనే అర్థం - పక్కలో వుంటేనే పెళ్ళాం
|
| చేతిలో విషమున్నా తినందే చావరు
|
| చేతి వ్రేళ్ళు అయిదూ ఒక రీతిగా ఉన్నాయా?
|
| చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు
|
| చేనుకు గట్టు ఊరికి కట్టు ఉండాలి
|
| చేను పండినా చేట అప్పే - మొగుడున్నా మొండి మెడే
|
| చేను పండాలి - ఇల్లు నిండాలి
|
| చేపపిల్లకు ఈత నేర్పాలా?
|
| చేయని చేతులు - కుడవని నోరు
|
| చేయని శృంగారం - మాయని మడత
|
| చేయలేనమ్మకు చేతినిండా పని
|
| చేయలేనమ్మకు కులుకులు మెండు - వండలేనమ్మకు వగపులు మెండు
|
| చేలో పుట్టిన బీడు ఎక్కడికి పోను?
|
| చేలో పొత్తు కళ్ళంతో సరి
|
| చేలో లేనిది చేతిలో కెలా వస్తుంది?
|
| చేవ చచ్చినా షోకులు పోనట్లు
|
| చేసింది పోదు - చేయంది రాదు
|
| చేసినదంతా అనుభవించాలి
|
| చేసిన చేష్టలు ఎవరూ చూడరు, కోసిన ముక్కు అందరూ చూస్తారు
|
| చేసిన చేతికి చేవ - చేయనిచేతికి చీకు
|
| చేసిన చేతికే వెన్న ముద్దలు
|
| చేసిన పాపం చెపితే పోతుందా?
|
| చేసిన పాపాలకూ పెట్టిన దీపాలకూ సరి
|
| చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు
|
| చేసిన మేలు వృధా కాదు - చేసిన కీడు వృధా పోదు
|
| చేసిన వారికి చేసినంత మహదేవ!
|
| చేసుకున్న తర్వాత వండిపెట్టక తప్పుతుందా?
|
| చేసుకున్న కడుపు దింపుకోక తప్పదు
|
| చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవ
|
| చేసేదేమో బీదకాపురం - వచ్చేవేమో రాజరోగాలు
|
| చేసేది శివ పూజ - దూరేది దొమ్మరి గుడిసె
|
| చేసే పని చేయమంటే - నేసేవానివెంట పోతానన్నట్లు
|
| చేసేవి నాయకాలు, అడిగేవి తిరుపాలు, పెట్టకుంటే కోపాలు
|
| చేసేవి లోపాలు - చెపితే కోపాలు
|
| చేసేవి శివపూజలు - చెప్పేవి అబద్ధాలు
|
| చేస్తే మంచిపని చేయాలి - బ్రతికితే మంచిగా బ్రతకాలి
|
| చోటే లేదంటే మూల కూర్చోనా అన్నట్లు
|
| ఛీ! కుక్కా అంటే, ఏమక్కా! అని అన్నదట
|