| ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు
|
| ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు
|
| ఉంటే అమీరు - లేకుంటే పకీరు
|
| ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి
|
| ఉంటే ఊరు - పోతే పాడు
|
| ఉంటే లిక్కి - పోతే కొడవలి
|
| ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు
|
| ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు
|
| ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట
|
| ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు
|
| ఉండేది ఒక పిల్ల - వూరంతా మేనరికాలు
|
| ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?
|
| ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా?
|
| ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదన్నట్లు
|
| ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు
|
| ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట
|
| ఉట్టికి నాలుగు చేరులు తెగినట్లు
|
| ఉట్టిమీద కూడు - వూరిమీద నిద్ర
|
| ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే!
|
| ఉడకవే ఉడకవే ఉగాదిదాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందట
|
| ఉడిగి ఉత్తరదిక్కు చేరినట్లు
|
| ఉడుతా భక్తిగా
|
| ఉడుత ఊపులకు చింతకాయలు రాలుతాయా?
|
| ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లు
|
| ఉత్త కుండకు వూపు లెక్కువ
|
| ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువ
|
| ఉత్తచేతులతో మూర వేసినట్లు
|
| ఉత్తపుణ్యానికి మొత్తుకు చచ్చినట్లు
|
| ఉత్తర ఉరిమి కురిసినా, త్రాచు తరిమి కరిచినా తిరుగులేదు
|
| ఉత్తర జూచి ఎత్తర గంప
|
| ఉత్తర పదును - ఉలవకు అదును
|
| ఉత్తరపు వాకిలి యిల్లు వూరికే యిచ్చినా తీసుకోరాదు
|
| ఉత్తరలో పూడ్చేకంటే గట్లమీద కూర్చుని ఏడ్వటం మేలు
|
| ఉత్తరలో చల్లిన పైరు కత్తెరలో నరికిన కొయ్య
|
| ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదు
|
| ఉత్తరాయణం వచ్చింది ఉరి పెట్టుకో మన్నాడుట
|
| ఉదయం ముద్దుల ఫలహారం - మధ్యాహ్నం కౌగిలి భోజనం - రాత్రికి అందాల విందులు అందట
|
| ఉదర పోషణార్ధం బహుకృత వేషం
|
| ఉద్దర అయితే వూళ్ళు కొంటారు, నగదు అయితే నశ్యంకూడా కొనరు
|
| ఉద్దర అయితే నా కిద్దరన్నట్లు
|
| ఉద్యోగం పురుష లక్షణం
|
| ఉద్యోగం పురుష లక్షణం గదా! గొడ్డలి తేరా నిట్రాడు నరుకుదాం అన్నాడట
|
| ఉద్యోగికి ఒక వూరనీ లేదు - ముష్టివానికి ఒక యిల్లనీ లేదు
|
| ఉద్యోగానికి దూరభూమి లేదు
|
| ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు
|
| ఉన్న వూరివాడికి కాటి భయం - పొరుగూరు వాడికి నీళ్ళ భయం
|
| ఉన్న వూరూ - కన్న తల్లీ ఒక్కటే
|
| ఉన్న వూరూ - మన్న ప్రజా
|
| ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడింది
|
| ఉన్నది ఒక కూతురు - వూరంతా అల్లుళ్ళు
|
| ఉన్నది పోదు -లేనిది రాదు
|
| ఉన్నదే మనిషికి పుష్టి - తిన్నదే గొడ్డుకి పుష్టి
|
| ఉన్నదీ పోయె వుంచుకున్నదీ పోయె అన్నట్లు
|
| ఉన్ననాడు ఉట్ల పండుగ - లేనినాడు లొట్లపండుగ
|
| ఉన్న మాటంటే వున్నవూరు అచ్చిరాదుట
|
| ఉన్నమాటంటే వులుకెక్కు వన్నట్లు
|
| ఉన్నమాట అంటే వూరికే చేటు
|
| ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టే
|
| ఉన్నవాడు వూరికి పెద్ద - చచ్చినవాడు కాటికి పెద్ద
|
| ఉపకారం అంటే వూళ్ళోంచి లేచిపోయినట్లు
|
| ఉపకారానికి పోతే అపకారం జరిగినట్లు
|
| ఉపదేశం లావు - ఆచరణ తక్కువ
|
| ఉపాయం లేనివాడు ఉపవాసంతో చచ్చాడన్నట్లు
|
| ఉపాయం లేనివాడ్ని ఊళ్ళోంచి వెళ్ళగొట్ట మన్నారు
|
| ఉపాయవంతుడు ఊరికి నేస్తం
|
| ఉపాయాలున్నవాడు ఊరిమీద బ్రతుకుతాడు
|
| ఉప్పు ఊరగాయ కాదు
|
| ఉప్పు తిన్నవాడు ఉపకారం చేస్తాడు
|
| ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది అన్నట్లు
|
| ఉప్పు మూటలు నీట ముంచినట్లు
|
| ఉప్పు లేని కూర - పప్పు లేని పెండ్లి
|
| ఉప్పు వేసి పొత్తు కలిపినట్లు
|
| ఉభయ భ్రష్టత్వం - ఉప్పరి సన్యాసం అన్నట్లు
|
| ఉమ్మడి పనికి బడుగు - సొంత పనికి పిడుగు
|
| ఉమ్మడి బర్రె పుచ్చి చచ్చిందన్నట్లు
|
| ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం యిద్దరికీ చేటు
|
| ఉయ్యాలలో బిడ్డను పెట్టి వూరంతా వెదకినట్లు
|
| ఉరిమిన మబ్బు కురవక మానదు
|
| ఉరిమిన మబ్బు, తరిమిన పాము వూరికే పోవు
|
| ఉలవకాని పొలం వూసరక్షేత్రం
|
| ఉలవ చేను పెట్టే మగడు వూరకుండక ప్రత్తి చేను పెట్టి ప్రాణం మీదకు తెచ్చాడు
|
| ఉలిపి కట్టె కేలరా వూళ్ళో పెత్తనాలు?
|
| ఉల్లి వుంటే మల్లి కూడా వంటలక్కే
|
| ఉల్లి ఉల్లే - మల్లి మల్లే
|
| ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే
|
| ఉల్లి ఎంత ఉడికినా కంపు పోదు
|
| ఉల్లి గడ్డంత కోడలు వస్తే స్మశానంలో వున్న అత్తగారు వులిక్కిపడిందట
|
| ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు
|
| ఉల్లి తిన్న కోమటి నోరు మూసుకున్నట్లు
|
| ఉల్లినీ తల్లినీ నమ్మి చెడినవారు లేరు
|
| ఉల్లి పది తల్లుల పెట్టు
|
| ఉల్లిపాయంత బలిజ వుంటే వూరంతా చెడుతుంది
|
| ఉల్లిపాయపెట్టని కోమటి వూరంతా ధారపోసినట్లు
|
| ఉల్లి మల్లెవుతుందా? వుంచుకున్నది పెళ్ళామవుతుందా?
|
| ఉల్లి ముట్టనిదే వాసన రాదన్నట్లు
|
| ఉసిరికాయలంత వుంటే వూరంతా ఏలవచ్చు
|
| ఊకదంపుడు మాటలు
|
| ఊకని దంపితే చియ్యం వస్తాయా?
|
| ఊపిరి వుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చు
|
| ఊపిరి పట్టితే బొజ్జ నిండుతుందా?
|
| ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట
|
| ఊరంతా ఒక త్రోవ - వులిపికట్టెది ఇంకొక త్రోవ
|
| ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదు
|
| ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట
|
| ఊరంతా నాన్నకు లోకువ - నాన్న అమ్మకు లోకువ
|
| ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదట
|
| ఊరకరారు మహాత్ములు
|
| ఊరపిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు
|
| ఊరించి వూరించి బెల్లం పెట్టినట్లు
|
| ఊరికళ వూరి గోడలే చెపుతాయి
|
| ఊరికి వచ్చినమ్మ నీళ్ళకు రాదా?
|
| ఊరికే పెట్టే అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు
|
| ఊరికే కూర్చునేవాడికి వురిమినా వుత్తేజం రాదు
|
| ఊరికి వస్తే మావాడింకొక డున్నాడన్నట్లు
|
| ఊరి గబ్బు చాకలికి తెలుసు
|
| ఊరి దగ్గరి చేనుకు అందరూ దొంగలే
|
| ఊరినిండా అప్పులు - తలనిండా బొప్పెలు
|
| ఊరి మీద వూరు పడ్డా కరణం మీద కాసు పడదు
|
| ఊరి ముందర చేను - ఊళ్ళో వియ్యము అందిరావు
|
| ఊరి ముందరి చేను వూరపిచ్చుకల పాలన్నట్లు
|
| ఊరిలో కుంటి - అడవిలో లేడి
|
| ఊరి వారి పసుపు - ఊరి వారికుంకుమ అన్నట్లు
|
| ఊరి వారి వత్తి, వూరి వారి చమురు, వూగు దేముడా వూగు అన్నట్లు
|
| ఊరుంటే మాదిగవాడ, మాలవాడ వుండవా?
|
| ఊరు ఉసిరికాయంత - తగవు తాటికాయంత
|
| ఊరుకు చేసిన వుపకారం - పీనుగుకు చేసిన శృంగారం ఒకటే
|
| ఊరు పొమ్మంటోంది - కాడు రమ్మంటోంది
|
| ఊరు మారినా పేరు మారదన్నట్లు
|
| ఊళ్ళేలని వాడు రాజ్య మేలుతాడా?
|
| ఊళ్ళో లేని మొగుడుకన్న - ఉపాదానమెత్తే మొగుడు మేలు
|
| ఊళ్ళో యిల్లు లేదు - పొలంలో చేను లేదు
|
| ఊళ్ళో పెళ్ళయితే కుక్కలకు హడావిడన్నట్లు
|
| ఊళ్ళో ముద్ద - గుళ్ళో నిద్ర
|
| ఊళ్ళో వియ్యం - ఇంట్లో కయ్యం
|
| ఊళ్ళో వియ్యం కలతల నిలయం
|
| ఊసరవెల్లిలాగా రంగులు మార్చినట్లు
|
| ఊహ వూళ్ళేలుతుంటే - రాత రాళ్ళు మోస్తున్నదిట
|
| ఋణము - వ్రణము ఒక్కటే
|
| ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు
|
| ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు
|