| కంగారులో హడావుడి అన్నట్లు
|
| కంచం, చెంబు బయటపారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు
|
| కంచం పొత్తేగానీ, మంచం పొత్తు లేదు
|
| కంచానికి ఒక్కడు - మంచానికి యిద్దరు
|
| కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
|
| కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది
|
| కంచెమీద పడ్డ గుడ్డను మెల్లగా తీయాలి
|
| కంచెలేని చేను, తల్లిలేని బిడ్డ ఒక్కటే
|
| కంచె వేసినదే కమతమన్నట్లు
|
| కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?
|
| కంటికింపైతే నోటికీ యింపే
|
| కంటికి తగిలే పుల్లను - కాలికి తగిలే పుల్లను కనిపెట్టి తిరగాలి
|
| కంటికి రెప్ప దూరమా?
|
| కంటికి రెప్ప - కాలికి చెప్పు
|
| కంటివంటి ప్రకాశం లేదు - మంటివంటి ఆధారం లేదు
|
| కండలేనివానికే గండం
|
| కందం చెప్పినవాడు కవి - పందిని పొడిచినవాడు బంటు
|
| కందకు లేదు, చేమకు లేదు, తోటకూర కెందుకు దురద?
|
| కందకు లేని దురద కత్తిపీట కెందుకు?
|
| కంది పండితే కరువు తీరుతుంది
|
| కంప తొడుగు ఈడ్చినట్లు
|
| కంపలో పడ్డ గొడ్డువలె
|
| కంబళిలో తింటూ బొచ్చు ఏరినట్లు
|
| కంసాలింటికెడితే బంగారమంటదుగానీ, కుమ్మరింటికెడితేమాత్రం మట్టి అంటుకుంటుంది
|
| కంసాలికూడు కాకులు కూడా ముట్టవు
|
| కంసాలి బర్రెనమ్ముతున్నాడు, లోపల లక్కవుందేమో చూడరా అన్నట్లు
|
| కంసాలి దొంగతనం కంసాలికే తెలుస్తుంది
|
| కక్కినకుక్క వద్దకూ కన్నకుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
|
| కక్కిన కూటికి ఆశించినట్లు
|
| కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపునొప్పి బాధ ఎరుగడు
|
| కక్కుర్తి పడ్డా కడుపు నిండాలి
|
| కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగవు
|
| కటికవానికి కత్తి అందించినట్లు
|
| కట్టని నోరూ, కట్టలేని నదీ ప్రమాదకరం
|
| కట్టిన యింటికి వంకలు చెప్పేవారు మెండు
|
| కట్టిన యిల్లు - పెట్టిన పొయ్యి
|
| కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు ఇంకొకరు
|
| కట్టినవాని కొక యిల్లయితే అద్దెకున్న వానికి అన్నీ యిళ్ళే
|
| కట్టుకొన్న పెండ్లామే చేయాలి - కన్నతల్లే చేయాలి
|
| కట్టుకొన్న మగడు - పెట్టెనున్న నగలు
|
| కట్టుకొన్న వాడికంటే వుంచుకున్న వాడి మీదే ప్రేమ ఎక్కువ
|
| కట్టు లేని ఊరు - గట్టు లేని చెరువు
|
| కట్టెవంకర పొయ్యే తీరుస్తుంది
|
| కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
|
| కడగా పోయే శనీశ్వరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు
|
| కడచిన దానికి వగచుట యేల?
|
| కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే
|
| కడివెడు పాలలో ఒక్క ఉప్పుకల్లు
|
| కడుపా కళ్ళేపల్లి చెరువా?
|
| కడుపా - చెరువా?
|
| కడుపుకు పెట్టిందే కన్నతల్లి
|
| కడుపు కూటికేడిస్తే - కొప్పు పూలకేడ్చిందట
|
| కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
|
| కడుపు చించుకున్నా గారడీ విద్యే అన్నట్లు
|
| కడుపు నొప్పికి కంట్లో కలికం పెట్టినట్లు
|
| కడుపు నిండితే గారెలు వగరు
|
| కడుపుతో ఉన్నమ్మ కనక మానదు - వండుకున్నమ్మ తినక మానదు
|
| కడుపున పుట్టిన బిడ్డ - కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి
|
| కడుపు నిండిన బేరాలు - కడుపు నిండిన మాటలు
|
| కడుపు మంట
|
| కడుపులో ఎట్లా వుంటే కాపురమట్లా వుంటుంది
|
| కడుపులో చల్ల కదలకుండా
|
| కడుపులోని మంట కానరాని మంట
|
| కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా?
|
| కడుపులో లేని శాంతి కౌగిలింతలో దొరుకుతుందా?
|
| కడుపు వస్తే కనే తీరాలి
|
| కడుపే కైలాసం - యిల్లే వైకుంఠం
|
| కతికితే అతకదు
|
| కత్తి తలగడకాదు - కల నిజం కాదు
|
| కత్తిపోటు తప్పినా కలం పోటు తప్పదు
|
| కత్తిమీద సాము
|
| కత్తు కలిస్తే పొత్తు నిలుస్తుంది
|
| కత్తెరలో వాన కనకపు పంట
|
| కథ అడ్డం తిరిగింది
|
| కథ కంచికీ - మన మింటికీ
|
| కథకు కాళ్ళు లేవు - ముంతకు చెవులు లేవు
|
| కదిపితే కందిరీగల తుట్టె
|
| కదిలిస్తే కంపు
|
| కదిలిస్తే గచ్చపొద
|
| కని గ్రుడ్డి, విని చెవుడు
|
| కనిపెంచిననాడు కొడుకులుగానీ, కోడళ్ళు వచ్చాక కొడుకులా?
|
| కనుమునాడు కాకి అయినా కదలదు
|
| కనుమునాడు కాకి గూడా మునుగుతుంది
|
| కనుమునాడు మినుము కొరకాలి
|
| కన్నతల్లికి కడుపుకు పెడితే, పినతల్లికి పిర్రకాలిందట
|
| కన్నతల్లికైనా మరుగుండాలి
|
| కన్నమ్మకే పొగరు - ఉన్నమ్మకే పొగరు
|
| కన్నామేగానీ, కడుపులో పెట్టుకుంటామా?
|
| కన్ను ఎరుగకున్న కడుపు ఎరుగుతుంది
|
| కన్ను గుడ్డిదయితే కడుపు గుడ్డిదా?
|
| కన్ను చూచి కాటుక - పిర్ర చూచి పీట
|
| కన్ను చూచిన దానిని నమ్ము - చెవి విన్నదానిని నమ్ము
|
| కన్ను పోయేంత కాటుక ఎందుకు?
|
| కన్ను ఎర్రబడ్డా, మిన్నెర్రబడ్డా కారక మానవు
|
| కన్నూ మనదే - వేలూ మనదే అని పొడుచుకుంటామా?
|
| కన్నె నిచ్చినవాణ్నీ, కన్ను యిచ్చినవాణ్నీ కడవరకూ మరువరాదు
|
| కన్నొకటి లేదు గానీ కాంతుడు కాడా?
|
| కన్యలో చల్లితే ఊదుకుని తినటానికయినా ఉండవు
|
| కపటము బయట దేవుడు - ఇంట్లో దయ్యము
|
| కప్పకాటు - బాపనపోటు లేవు
|
| కప్పలు కూస్తే వర్షం పడుతుంది
|
| కప్పి పెట్టుకుంటే కంపు కొట్టదా?
|
| కమ్మ అండ గాదు - తుమ్మ నీడ కాదు
|
| కమ్మకు వరస లేదు - కప్పకు తోక లేదు
|
| కమ్మగుట్టు గడప దాటదు
|
| కమ్మని రోగాలూ, తియ్యని మందులూ వుంటాయా
|
| కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు
|
| కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు
|
| కయ్యానికైనా, వియ్యానికైనా సమవుజ్జీ కావాలి
|
| కరక్కాయ - కన్నతల్లి
|
| కరణం, కాపూ నా ప్రక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో చూస్తా అందట
|
| కరణంతో కంటు కాటికి పోయినా తప్పదు
|
| కరణం సాధువూ కాడు - కాకి తెలుపూ కాదు
|
| కరణానికీ కాపుకీ జత - ఉలికీ గూటానికీ జత
|
| కరణానికి తిట్టు దోషం - చాకలికి ముట్టు దోషం లేదు
|
| కరణాన్ని, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు
|
| కరణాలూ కాపులూ ఏకమయితే కాకులు కూడా ఎగురలేవు
|
| కరవమంటే కప్పకు కోపం - విడవమంటే పాముకు కోపం
|
| కరువుకు దాసరులైతే పదాలెక్కడ వస్తాయి?
|
| కరివేపాకు కోసేవాడే వాడినట్లు
|
| కరువుకాలంలో ఒల్లనివాడు పంటకాలంలో పంపమని వచ్చాడట
|
| కరువుకు గ్రహణాలు మెండు
|
| కరువునాటి కష్టాలుండవు గానీ కష్టాలనాటి మాటలుంటాయి
|
| కరువులో అధికమాసం అన్నట్లు
|
| కరువు మానుప పంట - మిడతల మానప పంట
|
| కరువులో అరువు అన్నట్లు
|
| కరువులో కవల పిల్లలు
|
| కర్మ ఛండాలుని కంటే - జాతి ఛండాలుడు మేలు
|
| కర్మకి అంతం లేదు
|
| కర్కాటకం చిందిస్తే కాటకముండదు
|
| కర్కాటకం కురిస్తే కాడిమోకు తడవదు
|
| కర్ణుడు లేని భారతం - శొంఠి లేని కషాయం ఒక్కటే
|
| కర్ణునితో భారతం సరి - కార్తీకంతో వానలు సరి
|
| కర్ర చేత లేని వాణ్ణి గొర్రె కూడా కరుస్తుంది
|
| కర్ర విరగకుండా - పాము చావకుండా
|
| కర్రు అరిగితేనే కాపు బ్రతుకు
|
| కలకాలం ఆపదలు కాపురముంటాయా?
|
| కలకాలపు దొంగ ఒకరోజు దొరుకుతాడు
|
| కల్పవృక్షాన్ని కాఫీపొడి అడిగినట్లు
|
| కలల అలజడి కవ్వింతల రాజ్యం అన్నట్లు
|
| కలలో జరిగింది ఇలలో జరగదు
|
| కలలో భోగం కలతోటే సరి
|
| కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు
|
| కల్ల పసిడికి కాంతి మెండు
|
| కలిగినదంతా కడుపు కోసమే - ఎంత పెంచినా కాటి కోసమే
|
| కలిగిన వారికి అందరూ చుట్టాలే
|
| కలిగినమ్మ గాదె తీసేటప్పటికి లేనమ్మ ప్రాణం పోయిందట
|
| కలిగినమ్మ రంకు - కాషాయ బొంకు ఒక్కటే
|
| కలిపి కొట్టరా కావేటి రంగా!
|
| కలిమి ఉన్నంత సేపే బలగము
|
| కలిమికి పొంగరాదు - లేమికి క్రుంగరాదు
|
| కలిమి గలవాడే కులము గలవాడు
|
| కలిమిగల లోభికన్నా పేద మేలు
|
| కలిమి లేములు కావడి కుండలు
|
| కలిసొచ్చే కాలానికి కుందేలు వంటింట్లోకి వస్తుంది
|
| కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు
|
| కలుపు తీయని మడి - దేవుడు లేని గుడి
|
| కలుపు తీయనివారికి కసువే మిగుల్తుంది
|
| కల్యాణానికి ఒకరు వొస్తే కన్నం వేయటానికి ఇంకొకరొస్తారు
|
| కళ్ళలో నీటిని తుడవగలంగానీ కడుపులో బాధ తుడవలేం
|
| కళ్ళు ఆర్పే అమ్మ ఇళ్ళు ఆర్పుతుంది
|
| కళ్ళు ఉంటేనే కాటుక
|
| కళ్ళు కళ్ళు సై అంటే కౌగిళ్ళే మల్లెపందిరి అన్నట్లు
|
| కళ్ళు కావాలంటాయి - కడుపు వద్దంటుంది
|
| కళ్ళు నెత్తి కొచ్చినట్లు
|
| కళ్ళు పెద్దవి - కడుపు చిన్నది
|
| కళ్ళుపోయిన తర్వాత సూర్యనమస్కారాలు చేసినట్లు
|
| కళ్ళెం - పళ్ళెం పెద్దవిగా ఉండాలి
|
| కవికీ - కంసాలికీ సీసం తేలిక
|
| కవితకు మెప్పు - కాంతకు కొప్పు అందం
|
| కవ్వింతల అల్లరికి కౌగిలింతల ఖైదు
|
| కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగలబెట్టినట్లు
|
| కష్టపడి సుఖపడమన్నారు
|
| కష్ట సంపాదన - యిష్ట భోజనం
|
| కష్టాలు కలకాలం కాపురం ఉండవు
|
| కష్టే ఫలి
|
| కసిపోనమ్మ మసి పూసుకున్నదట
|
| కాంతా కనకాలే కయ్యాలకి మూలాలు
|
| కాకి అరిస్తే చుట్టాలు వస్తారు
|
| కాకి అరిస్తే భయపడి పక్కింటాయన్ని కౌగలించుకున్నదట
|
| కాకి గూటిలో కోయిల పిల్లలాగా
|
| కాకిపిల్ల కాకికి ముద్దు
|
| కాకి ముక్కుకు దొండపండు
|
| కాకులను కొట్టి, గ్రద్దలకు వేసినట్లు
|
| కాకుల మధ్య కోయిల లాగా
|
| కాకై కలకాలం మన్నేకంటే - హంసై ఆరునెలలున్నా చాలు
|
| కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు
|
| కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
|
| కాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలేదు
|
| కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు
|
| కాటికి పోయినా కాసు తప్పదు
|
| కాటిదగ్గర మాటలు కూటి దగ్గర వుండవు
|
| కాటుక కళ్ళ వాడూ - కళ్ళార్పు వాడూ కొంపలు ముంచుతారు
|
| కాడిక్రిందకు వచ్చిన గొడ్డు - చేతికంది వచ్చిన బిడ్డ
|
| కాడిని మోసేవాడికి తెలుస్తుంది బరువు
|
| కాని కాలానికి కర్రే పామై కరుస్తుంది
|
| కాని కూడు తిన్నా కడుపు నిండాలి
|
| కాని పనికి కష్టం మొండు
|
| కానీకి కొబ్బరికాయ యిస్తారని కాశీదాకా పోయినట్లు
|
| కాకున్నది కాక మానదు
|
| కాపు - కరణం ఏకమయితే నీళ్ళు కూడా దొరకవు
|
| కాపుకు విశ్వాసం లేదు - కందికి చమురు లేదు
|
| కాపు బీదైతే కళ్ళం బీద
|
| కాపురం గుట్టు - రోగం రట్టు
|
| కాపురం చేసే కళ కాలు త్రొక్కేవేళే తెలుస్తుంది
|
| కాపుల కష్టం - భూపుల సంపద
|
| కాపుల చదువులు కాసుల నష్టం - బాపల సేద్యం భత్యం నష్టం
|
| కాపుల జాతకాలు కరణాల కెరుక
|
| కామానికి సిగ్గూ లజ్జా లేవు
|
| కామానికి కండ్లు లేవు
|
| కామి గాక మోక్షగామి కాలేడు
|
| కాముని పట్నంలో కౌగిలి కట్నాలన్నట్లు
|
| కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది
|
| కాయని కడుపూ - కాయని చెట్టూ
|
| కాయలో పత్తి కాయలో ఉండగానే సోమన్నకు ఆరుమూరలు నాకు పదిమూరలు అన్నట్లు
|
| కారణం లేకుండా కార్యం పుట్టదు
|
| కారాని కాలానికి రారాని పాట్లు
|
| కారుచిచ్చుకు గాలి తోడైనట్లు
|
| కార్యం అయ్యేదాకా తలవంచుకుంటే, కలకాలం తలెత్తుకు తిరగవచ్చు
|
| కార్తీక మాసాన కడవలు కడిగే పొద్దుండదు
|
| కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదరినా చెడుతాయి
|
| కాలం గడిచి పోతుంది - మాట నిలిచిపోతుంది
|
| కాలం తప్పిననాడు పై బట్టే పామై కరుస్తుంది
|
| కాలం వచ్చి చిక్కింది గానీ లేడికి కాళ్ళు లేక కాదు
|
| కాలమొక్కరీతిగా గడిపిన వాడే గడిచి బ్రతికిన వాడు
|
| కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు
|
| కాలికి దూరమయితే కన్నుకు దూరమా?
|
| కాలికి రాని చెప్పును కడగా వుంచమన్నారు
|
| కాలికి వేస్తే మెడకు - మెడకు వేస్తే కాలికి
|
| కాలికి బలపం కట్టుకు తిరిగినట్లు
|
| కాలిది తీసి నెత్తికి రాచుకున్నట్లు
|
| కాలు కాలిన పిల్లి వలె
|
| కాలూ, చెయ్యి ఉన్నంతకాలం కాలం గడుస్తుంది
|
| కాలు జారితే తీసుకోగలం - నోరు జారితే తీసుకోలేం
|
| కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుగానీ కన్ను తడవకుండా జీవితం దాటలేం
|
| కాలు త్రొక్కిన వేళ - కంకణం కట్టినవేళ
|
| కాలు నొచ్చినా, కన్ను నొచ్చినా చేసేవాళ్ళు కావాలి
|
| కాలే గుడిసెకు పీకే వాసమే లాభం
|
| కావలసినవన్నీ తాకట్టు పెడతా స్వంతం చేసుకుంటావా అందిట
|
| కాళ్ళ తంతే పెరిగేది పుచ్చకాయ - కుళ్ళేది గుమ్మడి కాయ
|
| కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు
|
| కాళిదాసు కవిత్వం కొంత - నా పైత్యం కొంత అన్నట్లు
|
| కాశీకి పోయి కొంగ పియ్య తెచ్చినట్లు
|
| కాశీకి పోయినవాడూ - కాటికి పోయినవాడూ ఒక్కటే
|
| కాశీకి పోయినా కర్మ తప్పదు
|
| కాషాయంపైన, కషాయంలోపల వుంటే ప్రయోజనం లేదు
|
| కాసుకు కాలెత్తేదానికి కాశీ ఎందుకు?
|
| కాసుకు గతి లేదు గానీ కోటికి కొంగు పట్టాడట
|
| కాసులుగలమ్మ కట్టా విప్పా - వేషంకలమ్మ విడవా మడవా
|
| కాసులు గలవాడే రాజు
|
| కాస్త ఓడంటే అంతా ఓడినట్లు
|
| కిందపడ్డా మీసాలకు మన్ను కాలేదన్నట్లు
|
| కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లు
|
| కింద పెట్టిన పంటలుండవు - పైన పెట్టిన వానలుండవు
|
| కిష్కింధాపుర అగ్రహారీకులు లాగా
|
| కీడెంచి మేలెంచవలె
|
| కీలెరిగి వాత పెట్టాలి
|
| కుంచమంత కూతురుంటే మంచంలోనే కూడు
|
| కుంటికులాసం ఇంటికి మోసం
|
| కుంటి గాడిదకు జారిందే సాకు
|
| కుంటివాడి తిప్పలు కుంటివాడివి - గూనివాడి తిప్పలు గూనివాడివి
|
| కుంటి సాకులు - కొంటె మాటలు
|
| కుంటి వాడయినా ఇంటి వాడే మేలు
|
| కుండల దుమ్ము రోకళ్ళతో దులిపినట్లు
|
| కుండ ఎప్పుడు వేరో కుదురూ అప్పుడే వేరు
|
| కుండలు మూయను మూకుళ్ళున్నాయి కానీ - నోళ్ళను మూయ మూకుళ్ళు లేవు
|
| కుండలు, చాటలు లేవని వండుకుతినటం మానుతామా?
|
| కుండలో కూడు కుండలో వుండాలి - బిడ్డలు గుండ్రాయిల్లాగా వుండాలి
|
| కుండల్లో గుర్రాలు తోలినట్లు
|
| కుండ వేరయితే కులం వేరా?
|
| కుందేటి కొమ్ము సాధించినట్లు
|
| కుక్క కాటుకు చెప్పుదెబ్బ
|
| కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు
|
| కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే
|
| కుక్క తోక చక్కనౌతుందా?
|
| కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు
|
| కుక్కను తెచ్చి అందలంలో కూర్చోపెడితే కుచ్చులన్నీ తెగ కొరికిందట
|
| కుక్కను ముద్దు చేస్తే మూతంతా నాకుతుంది
|
| కుక్క బ్రతుకు - నక్క చావు
|
| కుక్క బుద్ధి దాలిగుంటలో వున్నంతసేపే
|
| కుక్క ముట్టిన కుండ
|
| కుక్కలూ కుక్కలూ కాట్లాడుకుని కూటిలో దుమ్ము పోసుకుంటాయి
|
| కుక్కలు చింపిన విస్తరిలాగా
|
| కుక్క వస్తే రాయి దొరకదు - రాయి దొరికితే కుక్క రాదు
|
| కుచేల సంతానంలాగా
|
| కుట్టని రవిక చేతిలో వున్నా ఒకటే - ఏలని మొగుడు ఊరిలో వున్నా ఒకటే
|
| కుట్టితే తేలు - కుట్టకుంటే కుమ్మరి పురుగు
|
| కుట్టేవాడి కుడిచేతి క్రింద - చీదేవాడి ఎడమచేతి క్రింద ఉండరాదు
|
| కుడికాలు పెడితే కుల క్షయం - ఎడమకాలు పెడితే వంశ క్షయం
|
| కుడిచేత్తో యిచ్చి, ఎడమచేత్తో తీసుకున్నట్లు
|
| కుడిచేత్తో చేసే దానం ఎడమచేయికి తెలియరాదు
|
| కుడితిలో పడ్డ ఎలుకలాగా
|
| కుడవబోతూ రుచు లడిగినట్లు
|
| కుదువ సొమ్ముకు కొంత హాని
|
| కుప్ప తగుల బెట్టి పేలాలు వేయించుకున్నట్లు
|
| కుమ్మరి పురుగుకు మన్ను అంటుతుందా?
|
| కుమ్మరి వీధిలో కుండలమ్మినట్లు
|
| కుమ్మరాయిలో ఇత్తడి ముంతలు ఏరినట్లు
|
| కుమ్మరి వారి కోడలు ఆము దగ్గరైనా కన్పించదా?
|
| కుర్రవాడి గూర్చి అడగండిగానీ చెవుల కమ్మల విషయం మాత్రం అడగొద్దు అన్నట్లు
|
| కులం కన్నా గుణం ప్రధానం
|
| కులం కొద్దీ గుణం
|
| కులం చెడ్డా గుణం దక్కవలె
|
| కులమింటి కోతి అయినా మేలు
|
| కులము చెరిచేవారే గానీ కూడు పెట్టే వారుండరు
|
| కులము తక్కువ వాడు కూటికి ముందు
|
| కుల మెరిగి కోడలిని - జాతి నెరిగి గొడ్డును తీసుకోవాలి
|
| కులవిద్యకు సాటిలేదు గువ్వల చెన్నా
|
| కులహీనమైనా వరహీనం కారాదు
|
| కుళ్ళే వాళ్ళ ముందే కులకాలి
|
| కుళ్ళే వాళ్ళ ముందే భగవంతుడు కులుకుతాడు
|
| కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట
|
| కూటికి గతి లేదు గానీ మీసాలకు సంపంగ నూనె
|
| కూటికి తక్కువైతే కులానికి తక్కువా?
|
| కూటికి పేదయినా చేతకు బీద కాదు
|
| కూటికుంటే కోటికున్నట్లే
|
| కూటి కోసం కోటి విద్యలు
|
| కూటి పేద తోడు పోగొట్టుకుంటాడు
|
| కూడబెట్టిన వాడు కుడవ నేర్చునా?
|
| కూడు తిని కుల మెంచినట్లు
|
| కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ
|
| కూడు పెట్టినామెను తొడ పొందు అడిగినట్లు
|
| కూడూ, గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా నన్నాడట
|
| కూడే కూడే కాపురాన్ని కూలదొయ్యకపోతే నేను నీ రంకు మొగుణ్ణే కాదు అన్నాడుట
|
| కూతురని కుంచడిస్తే, తల్లని కంచెడు యిచ్చిందట
|
| కూతురి పురుడు యింట్లో - కోడలి పురుడు అడవిలో
|
| కూతురు కనకపోతే అల్లుడిమీద పడి ఏడ్చినట్లు
|
| కూతురు చెడితే తప్పు తల్లిది
|
| కూన అని పెంచితే గండై కరవ వచ్చిందట
|
| కూనలమ్మ సంగీతం వింటూంటే కూడు దొరికినట్లే!
|
| కూపస్థ మండూకం లాగా
|
| కూరకు తాలింపు - చీరకు ఝాడింపు
|
| కూర లేని తిండి కుక్క తిండి
|
| కూరిమిగల దినములలో నేరము లెన్నడును తోచవు
|
| కూరిమి చెడితే అన్నీ దోషాలే
|
| కూర్చుంటే కుక్క కఱవదు
|
| కూర్చుంటే లేవలేడు గానీ, ఎగిరెగిరి తంతాడట
|
| కూర్చున్నవానికి కుప్పలు - తిరిగేవానికి తిప్పలు
|
| కూర్చుని తింటుంటే కొండలయినా కరిగిపోతాయి
|
| కూర్చుని తింటుంటే గుళ్ళూ, గోపురాలూ ఆగవు
|
| కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు
|
| కూలికి వచ్చి మానం దోచినట్లు
|
| కూలివాడి ప్రొద్దా! కుంకవే ప్రొద్దా!
|
| కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెఱచినట్లు
|
| కృత్తిక, పునర్వసులు సత్తువ పంట
|
| కృత్తికలో కుతికె పిసుకుడు
|
| కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు
|
| కృష్ణా స్నానానికి కొండుభొట్లాజ్ఞా
|
| కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే చలేమిటి?
|
| కొంగులాగితే రానిది కన్ను గీటితే వస్తుందా?
|
| కొంగ జపము చేపల కోసమే
|
| కొంగు తాకితే కోటి వరహాలు
|
| కొంగున నిప్పు మూట కట్టుకొన్నట్లు
|
| కొంటే రానిదే కొసరితే వస్తుందా?
|
| కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు
|
| కొండంత చీకటి - గోరంత దీపం
|
| కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?
|
| కొండంత నిరాశ - గోరంత ఆశ
|
| కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగలమా
|
| కొండంత దేవుడికి గోరంత బెల్లం
|
| కొండంత మొగుడే పోగా లేంది ఇవన్నీ యెందుకు అన్నదట
|
| కొండంత రాగంతీసి గోరంత పదం చెప్పినట్లు
|
| కొండ అద్దంలో కొంచెమే
|
| కొండకు వెంట్రుక ముడివేసి లాగితే, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది
|
| కొండగాలికి పైట జారితే, అందగాడి చూపుకి చీర జారిందట
|
| కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట
|
| కొండను తలతో ఢీకొన్నట్లు
|
| కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
|
| కొండలి మంగలి పనిలాగా
|
| కొండలు మ్రింగేవాడికి గుడులొక లెక్కా
|
| కొండ మీద గోలేమిటంటే కోమటాళ్ళ రహస్యాలన్నట్లు
|
| కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాళ్ళు
|
| కొండలు పిండి కొట్టినట్లు
|
| కొండవీటి చేంతాడులాగా
|
| కొండి మీటుడు - గోడ కెక్కుడు
|
| కొంపకాలి ఏడుస్తుంటే నీళ్ళు కాచుకోనా అని అడిగినట్లు
|
| కొక్కిరాయీ కొక్కిరాయీ ఎందుకు పుట్టావంటే చక్కని వాళ్ళను వెక్కిరించటానికి అన్నదట
|
| కొట్టా వద్దు తిట్టా వద్దు వాడి చావు వాడే చస్తాడన్నట్లు
|
| కొడితే కొట్టాడు కానీ క్రొత్తకోక పెట్టాడు
|
| కొడుకు బాగుండాలి - కోడలు ముండమొయ్యాలన్నట్లు
|
| కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?
|
| కొడుకు ముద్దు - కోడలు మొద్దు
|
| కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డదట
|
| కొత్త ఒక వింత - పాత ఒక రోత
|
| కొత్త ఆవకాయ - కొత్త పెళ్ళాం
|
| కొత్త కాపురం, కొత్త కత్తిపీట కొత్తలో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయి
|
| కొత్త కుండలో నీళ్ళు, కొత్త పెళ్ళాం బహు తీపి
|
| కొత్తంత పండుగా లేదు - తల్లంత దయా లేదు
|
| కొత్తది నేర్వలేడు - పాతది మరువలేడు
|
| కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు
|
| కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు
|
| కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు
|
| కొత్త సేద్యగాడు పొద్దెరుగడు
|
| కొని తింటూంటే కోమటి నేస్తం
|
| కొన్న దగ్గర కొసరుగానీ, కోరిన దగ్గర కొసరా?
|
| కొన్నంగడిలోనే మారు బేరమా?
|
| కొన్నది వంకాయ - కొసరింది గుమ్మడికాయ
|
| కొన్నవాడు తినక మానడు
|
| కొన్నాళ్ళు చీకటి - కొన్నాళ్ళు వెన్నెల
|
| కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే
|
| కొమ్ములు చూచి బేరమాడినట్లు
|
| కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట
|
| కొర్ర గింజంత కోడల్ని చూస్తే కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందట
|
| కొరివితో తల గోక్కున్నట్లు
|
| కొరివి పెట్టేవాడే కొడుకు
|
| కొల్లేటి పంట కూటికే చాలదు
|
| కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగ
|
| కొసరితేగానీ రుచి రాదు
|
| కొసరి భోజనం పెట్టావ్ -మరి ఆ ముచ్చట కూడా తీర్చమన్నాడట
|
| కో అంటే కోటిమంది
|
| కోక కేకేస్తే రవిక రంకేసిందిట
|
| కోక ముడి విప్పుతూ వరసలడిగినట్లు
|
| కోకా, రైకా కలవని చోట చూపి ఊరించినట్లు
|
| కోటలో పాగా వేసినట్లు
|
| కోటి విద్యలు కూటి కొరకే
|
| కోడలా! కోడలా! నీ భోగమెంతసేపే అంటే మా అత్త మాలపల్లినుంచి తిరిగి వచ్చిందాకా అందిట
|
| కోడలి కన్నీళ్ళు కనబడతాయిగానీ, అత్త పెట్టే పెట్టు కనబడదు
|
| కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు
|
| కోడలికి బుద్ధి చెప్పి అత్త ఱంకు పోయిందట
|
| కోడలు గృహ ప్రవేశం - అత్త అగ్ని ప్రవేశం
|
| కోడలు నలుపైతే కులమంతా నలుపే
|
| కోడలు వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళ
|
| కోడికి కులాసా లేదు - కోమటికి విశ్వాసం లేదు
|
| కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు
|
| కోడి రెక్కారవేస్తే గొప్పవాన
|
| కోడీ, కుంపటీ లేకపోతే తెల్లారదా?
|
| కోతలకు ఉత్తర కుమారుడు
|
| కోతికి అద్దం చూపినట్లు
|
| కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
|
| కోతి చస్తే గోడవతల పారేసినట్లు
|
| కోతికి తేలు కుట్టినట్లు
|
| కోతికి పుండయితే గోకా, నాకా
|
| కోతికి బెల్లం, కోమటికి ధనం చూపరాదు
|
| కోతి చావు, కోమటి ఱంకు ఒక్కటే
|
| కోతి పంచాయితీ కొంప తీస్తుంది
|
| కోతి పుండు బ్రహ్మరాక్షసి
|
| కోతి రూపుకు గీత చక్కన - పాత గోడకు పూత చక్కన
|
| కోపం గొప్పకు ముప్పు - హంగు అల్లరికి ముప్పు
|
| కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు
|
| కోమటి యిల్లు కూలినట్లు
|
| కోమటికులం పైసాకు తులం
|
| కోమటికీ కోతికీ ముల్లె చూపరాదు
|
| కోమటితో మాట - కోతితో సయ్యాట ప్రమాదాలు
|
| కోమటికి లేమి - కంసాలికి కలిమి వుండదు
|
| కోమటి సాక్ష్యం - బాపన వ్యవసాయం
|
| కోమట్ల కొట్లాట - గోచీ వూగులాట
|
| కోమలి తనువే కాముని ధనువు
|
| కోమలాంగి సోకు కోనసీమ కొబ్బరి లాంటిదిట
|
| కోరి అడిగితే కొమ్మెక్కుతారు
|
| కోరి నెత్తికెత్తుకున్న దేవర దయ్యమై పట్టుకున్నట్టు
|
| కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు
|
| కోరుకున్న కోడలు వస్తే, నెత్తిమీద నిప్పులు పోస్తుంది
|
| కోర్టులో గెలిచినవాడు యింట్లో ఏడిస్తే, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు
|
| కోర్టు కెక్కినవాడూ, గాడిద నెక్కినవాడూ ఒక్కటే
|
| కౌగిలించి చేసుకునేవే ప్రేమ వందనాలు
|
| కౌగిట్లో పరువాలు పడతియిచ్చే నజరానాలు
|
| కౌగిలింతకన్న సుఖం లేదు - కాపురమంత మజా లేదు
|
| కౌగిలింతలకే కన్నె తాపాలు (చెల్లు) అన్నట్లు
|
| కౌగిలింతల బిగువెంతంటే నచ్చినవాడి శక్తంత అందిట
|
| కౌగిలిహోరూ మల్లెలజోరూ తప్పితే కడుపుపండే మాటేమైనా వుందా? అందిట
|
| కౌగిళ్ళ కట్నాలే సొగసులకు నజరానాలన్నట్లు
|
| కౌగిళ్ళ గుసగుసలు కాముని దరహాసాలన్నట్లు
|
| కౌగిళ్ళ పందిట్లో పూలంగి సేవలన్నట్లు
|
| కౌగిళ్ళ బంధాలేసి బుగ్గల్లో మందారాలు పూయిస్తే అందాల గంధాలు పూస్తా అందిట
|
| కౌగిళ్ళ స్వర్గాలు కాముని రాజమార్గాలు అన్నట్లు
|
| ఖొజ్జా మొగుడు పక్కలో వున్నా ఒక్కటే వీధిలో వున్నా ఒక్కటే
|