| జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట
|
| జంగాలో! దాసర్లో! ముందూరును బట్టి
|
| జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మెందుకు?
|
| జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
|
| జనవాక్యం కర్తవ్యం
|
| జనవాక్యం గీటురాయి
|
| జన్మకొక శివరాత్రి అన్నట్లు
|
| జబ్బొకటి - మందొకటి
|
| జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
|
| జయాపజయాలు ఒకరి సొమ్ముగావు
|
| జరిగితే జల్లెడతో మోయవచ్చు
|
| జరిగితే జ్వరమంత సుఖం లేదు
|
| జరుగుబాటు తక్కువ - అదిరిపాటెక్కువ
|
| జలగ పట్టినట్లు
|
| జ్వర జిహ్వకు పంచదార చేదు
|
| జాతి కొద్దీ బుద్ధి - కులం కొద్దీ ఆచారం
|
| జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు
|
| జారితేనూ, సాగితేనూ పడమన్నారు
|
| జానెడు పిట్టకు మూరెడు తోక
|
| జ్ఞాతి గుఱ్ఱు - అరటి కఱ్ఱు వదలవు
|
| జింకకు కొమ్ములు బరువా?
|
| జిల్లేడు పువ్వుకు తుమ్మెద లాశించినట్లు
|
| జివ తక్కువ - జీత మెక్కువ
|
| జిహ్వకొక రుచి - పుఱ్ఱెకొక బుద్ధి
|
| జీతం బత్తెం లేకుండా తోడేలు గొర్రెలు కాస్తానందట
|
| జీతం లేని నౌకరు, కోపం లేని దొర లేరు
|
| జీలకర్ర - శింగినాదం
|
| జీలకర్రలో కర్రాలేదు - నేతిబీరలో నెయ్యీ లేదు
|
| జుట్టుంటే ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చు
|
| జుట్టున్నమ్మ ఏకొప్పు అయినా పెడుతుంది
|
| జెముడు కంచెకు శ్రేష్ఠం - రేగడి చేనుకు శ్రేష్ఠం
|
| జ్యేష్ఠ చెడకురియును - మూల మురుగ కురియును
|
| జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు
|
| జోడు లేని బ్రతుకు తాడు లేని బొంగరం
|
| జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు
|