| ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు
|
| ఎంగిలికి ఎగ్గు లేదు - తాగుబోతుకు సిగ్గు లేదు
|
| ఎంచపోతే మంచమంతా కంతలే
|
| ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు
|
| ఎండా వాన కలిసివస్తే కుక్కా నక్కల పెళ్ళంట
|
| ఎండు నేలమీద ఎండ్రకాయ కనబడితే వాన పడుతుంది
|
| ఎంత వుంటేనేం తినేది అన్నమే, బంగారం కాదు
|
| ఎంత తిన్నా పరగడుపే
|
| ఎంత ఉప్పు తింటే అంత దాహం
|
| ఎంత చెట్టుకు అంత గాలి
|
| ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు
|
| ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
|
| ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక
|
| ఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు
|
| ఎంత ప్రాప్తమో అంతే ఫలం
|
| ఎంతమంచి గొల్లవాడికైనా వేపకాయంత వెర్రి వుండకపోదు
|
| ఎంతయినా పరాయి సొమ్ము పరమాన్నమన్నట్లు
|
| ఎంతవాడయినా ఆడదానికి లోకువే
|
| ఎంత వాడయినా కాంతా దాసుడే
|
| ఎంత వెలుగుకు అంత చీకటి
|
| ఎంత సంపదో అంత ఆపద
|
| ఎంత సంపాదించినా కూటికే - ఎంత బ్రతికినా కాటికే
|
| ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు
|
| ఎందుకు ఏడుస్తున్నావంటే, మొగుడు కొట్టబోయే దెబ్బలకందంట
|
| ఎక్కడ వున్నావే గొంగళీ అంటే వేసిన చోటే వున్నానన్నదట
|
| ఎక్కడయినా బావే గానీ వంగ తోట దగ్గర కాదు
|
| ఎక్కడికి పోయినా ఏలినాటి శని తప్పదన్నట్లు
|
| ఎక్కడికి పోయినా చేసుకున్న ఖర్మం ఎదురు వస్తుంది
|
| ఎక్కడిదిరా ఈ పెత్తనమంటే - మూలనుంటే నెత్తినేసుకున్నానన్నాడట
|
| ఎక్కడి నీరూ పల్లానికే పయనం
|
| ఎక్కమంటే ఎద్దుకు కోపం - దిగమంటే కుంటికి కోపం
|
| ఎక్కి కాయను చూసి, దిగివచ్చి రాయి రువ్వినట్లు
|
| ఎక్కినవానికి ఏనుగు లొజ్జు
|
| ఎక్కువగా తిన్న పొట్ట - ఏకులు పెట్టిన బుట్ట చిరుగవు
|
| ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం - తక్కువ తెలివి తన్నుల కారణం
|
| ఎక్కువ వెల పెట్టి గుడ్డును, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనరాదు
|
| ఎగదీస్తే బ్రహ్మ హత్య - దిగదీస్తే గో హత్య
|
| ఎగిరి పడే గొడ్డే మరి మానెడు మోస్తుంది
|
| ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి
|
| ఎట్లాంటి కోమటికైనా నిమ్మకాయంత బంగారం వుంటుంది
|
| ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది
|
| ఎడపిల్ల ఏరాలితో సమానం
|
| ఎడమచేత్తో తెలియక చేసేది కుడిచేత్తో తెలిసి అనుభవించాలి
|
| ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లు
|
| ఎత్తివచ్చిన కాపురానికి ఏ కాలూనినా ఒక్కటే
|
| ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు
|
| ఎత్తుకు పైఎత్తు
|
| ఎత్తుబారం మొత్తుకోళ్ళు
|
| ఎత్తువారి బిడ్డ
|
| ఎత్తెత్తి అడుగులేస్తే పుల్లాకుల మీద పడ్డాయట
|
| ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే
|
| ఎద పొంగుతోంది - నా వన్నెలు చిన్నెలు చూడమన్నదట
|
| ఎదురు అన్నది మాట - ఎదాన పెట్టింది వాత
|
| ఎదుట ఉన్నవాడు పెళ్ళికొడుకు
|
| ఎదుట లేకుంటే ఎదలో వుండదు
|
| ఎదురింట్లో పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు
|
| ఎదురుగుండా అద్దముంటే వెక్కిరించుకో బుద్ధి
|
| ఎదురు తిరిగిన కుక్క, ఏదుపంది ఒక్కటే
|
| ఎదురు పడిన వాడే నా మొగుడు అన్నట్లు
|
| ఎద్దు ఎండకు లాగు - దున్న నీడకు లాగు
|
| ఎద్దుకు, ఎనుబోతుకు లంకె వేసినట్లు
|
| ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి?
|
| ఎద్దు కొద్దీ సేద్యం - చద్ది కొద్దీ పయనం
|
| ఎద్దు క్రొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు
|
| ఎద్దుగా కలకాలం బ్రతికేకంటే ఆబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు
|
| ఎద్దును అడిగా గంట కట్టేది?
|
| ఎద్దున్నవాడి సేద్యం చూడు - మంది వున్నవాడి బలం చూడు
|
| ఎద్దు పుండు కాకికి ముద్దా?
|
| ఎద్దు బీదదయితే చేను బీద
|
| ఎద్దు మంచిదయితే సంత కెందుకు వెళుతుందిట?
|
| ఎద్దులా ఉన్నావు పని చేయలేవా?
|
| ఎద్దులా తిని మొద్దులా నిద్ర పోయినట్లు
|
| ఎద్దువలె కుక్కను పెంచి తానే మొరిగినట్లు
|
| ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం
|
| ఎన్నడూ దొరకనమ్మకు ఏగానీ దొరికితే ముడిమీద ముడి ఏడు ముళ్ళు వేసిందట
|
| ఎన్నాళ్ళున్నా అత్తారింటికి పోకతప్పదు
|
| ఎన్ని పుటాలు పెట్టినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు
|
| ఎన్ని విద్యలయినా కుల విద్యకు సాటిరావు
|
| ఎన్నో వ్రణాలు కోసానుగానీ, నా వ్రణమంత బాధలేదు అన్నాడట
|
| ఎముకలేని నాలుక ఎట్లా త్రిప్పినా తిరుగుతుంది
|
| ఎముక లేని నాలుక ఏమయినా పలుకుతుంది
|
| ఎరగని ఊళ్ళో మొరగని కుక్క
|
| ఎరువుసొమ్ములు బరువుచేటు - తియ్యా పెట్టా తీపులచేటు - అందులో ఒకటి పోతే అప్పుల చేటు
|
| ఎరువు వుంటే వెఱ్ఱివాడూ సేద్యగాడే
|
| ఎరువు పెట్టిన చేను - ఏలుబడి అయిన కోడలు
|
| ఎరువు లేని చేను - వేగంలేని ఏరూ ఒకటే
|
| ఎరువు లేని పైరు - పరువు లేని వూరూ ఒక్కటే
|
| ఎఱను వేసి చేపను పట్టినట్లు
|
| ఎఱుక పిడికెడు ధనము
|
| ఎఱ్ఱ కోమటినీ నల్ల బ్రాహ్మడినీ నమ్మరాదు
|
| ఎఱ్ఱభూమి పంట ఒకనాటి మాట
|
| ఎలుకమీద కోపంతో ఇంటికి నిప్పంటించుకొన్నట్లు
|
| ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు తెల్లవార్లూ బాడుగ తోలారుట
|
| ఎవడి కంపు వాడికింపు
|
| ఎవడి నోటికంపు వాడికి తెలియదు
|
| ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు
|
| ఎవరి ఏడుపు వాళ్ళకే తగులుతుంది
|
| ఎవరి పిచ్చి వారికి ఆనందం
|
| ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్వటానికి?
|
| ఎవరికి పెట్టావే దండమంటే మీలో బుద్ధిహీనుడికి అన్నదట
|
| ఎవరికి వారే యమునాతీరే
|
| ఎవరి పాపాన వాళ్ళే పోతారన్నట్లు
|
| ఎవరి ప్రాణం వారికి తీపి
|
| ఎవరి బిడ్డ వారికి ముద్దు
|
| ఎవరి ముడ్డి క్రిందకి నీళ్ళు వస్తే వాళ్ళే లేస్తారు
|
| ఎవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కు
|
| ఎసట్లో గింజలన్నీ పట్టి చూడాలా?
|
| ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు
|
| ఏ ఎండకా గొడుగు పట్టినట్లు
|
| ఏకాంతంలో కాంతా కలాపాలే ముద్దన్నట్లు
|
| ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది
|
| ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లు
|
| ఏ కాలు జారినా పిర్రకే మోసం
|
| ఏకుతో తాకితే మోకుతో కొడతారు
|
| ఏకులాగ వచ్చి మేకులాగా అయినట్లు
|
| ఏ గాలికా చాప యెత్తినట్లు
|
| ఏ గుంటనీరు ఆ గుంటకేనన్నట్లు
|
| ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది
|
| ఏ గూటి పక్షి ఆ గూటికే
|
| ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పట్టరాదు
|
| ఏ చెట్టూ లేనిచోట ఆముదపుచెట్టు మహావృక్షం
|
| ఏటవతల యిచ్చేకన్నా యేట్లో పారేయటం ఉత్తమం
|
| ఏటి ఈతకు లంక మేత సరి
|
| ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా?
|
| ఏటి వొడ్డు చేనుకు మాటిమాటికీ భయం
|
| ఏటికి ఎదురీదినట్లు
|
| ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లు
|
| ఏటిగట్టు దాని మాట యెన్నడూ నమ్మరాదు
|
| ఏటిముందర - కూటిముందర తడవ సెయ్యకు
|
| ఏటివంక లెవరు తీరుస్తారు?
|
| ఏటివరద - నోటిదురద రెండూ ఒక్కటే
|
| ఏటుకు ఏటు - మాటకు మాట
|
| ఏట్లో పారే నీరు యెవరు త్రాగితేనేం?
|
| ఏట్లో వేసినా యెంచి వేయాలి
|
| ఏడవగలిగితే ఏడ్చేకొద్దీ వ్యవసాయం
|
| ఏడవనేరిస్తేనే వ్యవసాయం
|
| ఏడ్చి ముఖం కడుక్కున్నట్లు
|
| ఏడు కురచలు చూచి యెద్దు కొనాలి
|
| ఏడుపులో ఏడుపు
|
| ఏడుపులో ఎడమ చేయి అన్నట్లు
|
| ఏడు మాటలు మాట్లాడినా ఏడడుగులు నడిచినా గుణం తెలుస్తుంది
|
| ఏడు మెతుకులు కతికితే ఏనుగంత బలం
|
| ఏడుస్తూ ఏరువాక సాగిస్తే కాడీ, మోకూ దొంగలు యెత్తుకుపోయారట
|
| ఏడ్చేదాని ఎడమచేతి క్రిందా, కుట్టేదాని కుడిచేతి క్రిందా కూర్చోరాదన్నట్లు
|
| ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్లు
|
| ఏడ్చేవాడిని చూచి నవ్వినట్లు
|
| ఏతాము పాటకు ఎదురుపాట లేదు
|
| ఏ దారి అంటే గోదారి అన్నట్లు
|
| ఏదుంతిన్నా ఏకాదశే పందుంతిన్నా పరగడుపే
|
| ఏ దేముడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరు
|
| ఏనుగంత తండ్రి ఉండే కంటే ఎలుకంత తల్లి మేలు
|
| ఏనుగుకు వెలక్కాయలు లొటలొట
|
| ఏనుగు తొండమూ తిరుగుబోతు ముండ వూరుకోవు
|
| ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
|
| ఏనుగు నిచ్చి అంకుశం దాచుకున్నట్లు
|
| ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు
|
| ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యే
|
| ఏనుగుమీద ఈగ వాలినట్లు
|
| ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడా!
|
| ఏనుగులే గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా సంగతేమిటి అన్నదట
|
| ఏ పని చేసినా పొయ్యిలో ఏకులు దాచుకున్నట్లే
|
| ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
|
| ఏ పుట్టలో ఏ పాముందో?
|
| ఏ పూజ తప్పినా పొట్టపూజ తప్పదు
|
| ఏబ్రాసికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువ
|
| ఏ మందలో పట్టినా, మన మందలో ఈనితే సరి
|
| ఏమి చేసుకుని బ్రతకనమ్మా అంటే నోరు చేసుకుని బ్రతకమన్నట్లు
|
| ఏమి చేస్తున్నావురా అంటే పారబోసి యెత్తుతున్నా అన్నాట్ట
|
| ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట
|
| ఏమీ ఎరుగని వాడు చీరముడి, పోకముడి విప్పి ఆశ్చర్యంగా చూసాడట
|
| ఏమీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి పోయిందట
|
| ఏమీ లేకపోతే మూట విప్పి మళ్ళీ కట్టమన్నట్లు
|
| ఏమీ లేనమ్మకు యేడ్పులే శరణ్యం
|
| ఏమీ లేనివానికి ఏతులు లావు - స్వాములవారికి జడలు లావు
|
| ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్లు తినవచ్చు
|
| ఏరా బడాయిబావా అంటే ఏమే గుడ్డి కంటి మరదలా అన్నాడట
|
| ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి!
|
| ఏ రేవుకు వెళ్ళినా ముళ్ళపరిగే దొరికిందన్నట్లు
|
| ఏరు యెన్ని వంకలు పోయినా కలిసేది సముద్రంలోనే
|
| ఏరు యెంతపారినా కుక్కకు గతుకునీళ్ళే
|
| ఏరు ఏడామడలదూరం వుండగానే చీరవిప్పి చంకలో పెట్టుకున్నదట
|
| ఏరు దాటి తెప్ప తగలేసినట్లు
|
| ఏరు పోయిందే పోక - యేలిక చెప్పిందే తీర్పు
|
| ఏరు ముందా? ఏకాదశి ముందా?
|
| ఏరు మూరెడు తీస్తే - కొలను బారెడు తీస్తుంది
|
| ఏలటానికి వూళ్ళు లేకపోవచ్చుకానీ బిచ్చమెత్తుకు తినటానికి వూళ్ళే లేవా?
|
| ఏలేవాడి యెద్దు పోతేనేం - కాచేవాడి కన్ను పోతేనేం?
|
| ఏళ్ళు యెగసన - బుద్ధి దిగసన
|
| ఏవాడ చిలుక ఆవాడ పలుకు పలుకుతుంది
|
| ఏ వేషం వేస్తేనేం? గ్రాస మొస్తుంది గదా!
|
| ఏ వేషం వచ్చినా దివిటీ వానికే చేటు
|
| ఐదు నిముషాల సుఖానికి మరుజన్మ నెత్తాలి అందిట
|
| ఐశ్వర్య దేవత హలంలోనే వుంది
|
| ఐశ్వర్యానికి అంతం లేదు - దారిద్ర్యానికి మొదలూలేదు
|