| యతిమతం మొగుడికి ఎత్తుబారపు పెళ్ళాం
|
| యదార్థవాదీ లోక విరోధీ
|
| యథా పతీ తథా సతీ అన్నట్లు
|
| యాదవకులంలో ముసలం పుట్టినట్లు
|
| యిష్టమైన పియ్య యింగువతో సమానం
|
| యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు
|
| రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?
|
| రంకులాడికి నిష్ఠలు మెండు
|
| రంకు సాగితే పెళ్ళెందుకు?
|
| రంగడికీ లింగడికీ స్నేహం - రొట్టెకాడ గిజగిజలు
|
| రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?
|
| రతిలో సిగ్గు - రణములో భీతి కొరగావు
|
| రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు
|
| రత్నాలన్నీ ఒకచోట - రాళ్ళన్నీ మరొకచోట
|
| రవిక సవరిస్తూ కోకముడి విప్పినట్లు
|
| రసదెబ్బ తగలినిదే రంకు పుండు మానదు
|
| రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు
|
| రక్షించినవాడినే భక్షించినట్లు
|
| రాగం తీయనివాడు, రోగం రానివాడు లేడు
|
| రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు
|
| రాగి రా గోరును
|
| రాచపగ - పాము పగ
|
| రాచపీనుగు తోడు లేకుండా పోదు
|
| రాజకీయం తీరెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు
|
| రాజు కొడుకైనా కావాలి - సానిదాని తమ్ముడైనా కావాలి
|
| రాజు గుర్రం గాడిదైనట్లు
|
| రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్లు
|
| రాజు తలిస్తే దెబ్బలకు కొదువా!
|
| రాజుగారు వస్తున్నారంటే, పెళ్ళాంవంక అనుమానంగా చూసినట్లు
|
| రాజు తలిస్తే రాయికూడా పగులుతుంది
|
| రాజును చూచిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్ట బుద్ధయిందిట
|
| రాజు మెచ్చింది మాట
|
| రాజుల సొమ్ము రాళ్ళపాలు
|
| రాజుల హృదయం రాతితో సమం
|
| రాజ్యం వీరభోజ్యం
|
| రాజ్యాలు పోయినా రాజసాలు పోలేదన్నట్లు
|
| రాతిలో కప్ప రాతిలోనే బ్రతుకుతుంది
|
| రానప్పుడు బ్రహ్మ విద్య - వచ్చినప్పుడు కూసు విద్య
|
| రాని అప్పు రాతితో సమానం
|
| రాని వానిని పిలువ వేడుక
|
| రానున్నది రాక మానదు - పోనున్నది పోకమానదు
|
| రామ రామ అంటే రోమ రోమానికీ ఎక్కిందట
|
| రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లు
|
| రామాయణం రంకు - భారతం బొంకు
|
| రామాయణంలో పిడకల వేట అన్నట్లు
|
| రామాయణంలో పిడకల వేట - ప్రేమాయణంలో పడతుల వేట అన్నట్లు
|
| రామాయపట్నం మధ్యస్థం అన్నట్లు
|
| రామునివంటి రాజుంటే హనుమంతునివంటి బంటూ వుంటాడు
|
| రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు
|
| రావణాసురుడి కాష్టంలాగా
|
| రావాలంటే త్రోవేలేదా, కావాలంటే కరుణే రాదా!
|
| రాసలీల వేళలో రాయబారమన్నట్లు
|
| రాసుకుంటే రంగూకాదు - పూసుకుంటే పుణ్యం రాదు
|
| రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకొన్నట్లు
|
| రుచీపచీలేని కూర కంచానికి చేటు - అందం చందంలేని పెళ్లాం మంచానికి చేటు
|
| రూక లేనివాడు పోకచేయలేడు
|
| రూపాన గర్విష్టి - గుణాన పాపిష్టి
|
| రెంటికీ చెడ్డ రేవడిలాగా
|
| రెండావుల దూడ
|
| రెండు చేతులు కలిస్తేనే చప్పుడు
|
| రెండు నాలుకలవాడిలాగా
|
| రెండు పడవల పైన కాళ్ళు పెట్టినట్లు
|
| రెక్కలు విరిగిన పక్షిలాగా
|
| రెక్కాడితేగానీ డొక్కాడదు
|
| రెడ్డొచ్చె మొదలాడమన్నట్లు
|
| రెప్పలార్పేవాళ్ళు కొంపలార్పుతారు
|
| రేచీకటి మొగుడికి గుడ్డి పెళ్ళాం
|
| రేయంతా సొగసులాట - పగలంతా పరధ్యానం
|
| రేపటి నెమలికంటే నేటి కాకి మేలు
|
| రేపటి నొప్పుల మాటెలా వున్నా ఈ పూట ఈ నొక్కుళ్ళే బాగున్నాయి అందిట
|
| రేపల్లెవాడలో పాలమ్మినట్లు
|
| రేపు రేపంటే రేప్ చేసి చూపించాడట
|
| రేవతి వర్షం రమణీయం
|
| రైతు దున్నితేనే రాజులకు అన్నం
|
| రైతు లెక్కచూస్తే నాగలి కూడా మిగలదు
|
| రొక్కమిచ్చినవాడే వెలయాలికి మన్మథుడు
|
| రొట్టెకు రేపు లేదు
|
| రొట్టెముక్క యిస్తే పండుగ అన్నట్లు
|
| రొట్టెలవాడి పనికంటే ముక్కలవాడి పనిమేలు
|
| రొట్టె విరిగి నేతిలో పడినట్లు
|
| రొయ్యకు లేదా మూరెడు మీసం?
|
| రోగ మొకటి - మందొకటి
|
| రోగానికి మందుందిగానీ మనోవ్యాధికి మందుందా?
|
| రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా?
|
| రోగికి కోపమెక్కువ
|
| రోగి కోరుకుందీ పాలే వైద్యుడు చెప్పిందీ పాలే
|
| రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు?
|
| రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
|
| రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు
|
| రోషం లేని మూతికి మీసమెందుకు?
|
| రోషానికి రోలు మెడకు కట్టుకున్నట్లు
|
| రోహిణి ఎండలకు రాళ్ళు పగులుతాయి
|
| రోహిణిలో విత్తుట రోటిలో విత్తినట్లే
|
| రోహిణిలో రోకళ్ళు చిగుర్చనన్నా చిగురిస్తాయి, రోళ్ళు పగులనన్నా పగుల్తాయి
|
| రోహిణిలో విత్తటం రోళ్ళు నిండని పంట
|
| రౌతుకొద్దీ గుర్రం
|
| రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది
|
| లంక మేతకు - ఏటి ఈతకు సరి
|
| లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే
|
| లంఖణం పరమౌషధం
|
| లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు
|
| లంచం లేనిదే మంచ మెక్కనన్నట్లు
|
| లంజకు మొగుడొకడా?
|
| లంజకు నిక్కు - సంసారికి సిగ్గు
|
| లంజకు పిల్ల తగలాటము
|
| లంజకు పెట్టిన సొమ్మూ - గోడకు వేసిన సున్నం తిరిగి రావు
|
| లంజకు సిగ్గు తెగులు
|
| లంజ చెడి యిల్లాలయినట్లు
|
| లంజను లంజా అంటే రచ్చకెక్కుతుంది - ఇల్లాలిని లంజా అంటే యింట్లో దూరుతుంది
|
| లక్కవంటి తల్లి - రాయివంటి బిడ్డ
|
| లగ్నంలో తుమ్మినట్లు
|
| లక్షాధికారయినా కావాలి - భిక్షాధికారయినా కావాలి
|
| లాభం గూబల్లోకి వచ్చింది
|
| లాభంలేని శెట్టి వరదకు పోడు
|
| లుక్కులు గాదు లిప్పులు కావాలన్నాడట
|
| లెక్క చూస్తే బొక్క పగులుతుంది
|
| లేడికి లేచిందే ప్రయాణం
|
| లేడిని చూచినవాళ్ళంతా వేటగాళ్ళే
|
| లేని త్యాగి కంటే ఉన్న లోభి మేలు
|
| లేని దాత కన్నా ఉన్న లోభి నయం
|
| లేనిదాని కోసం పోతే ఉన్నది కాస్తా ఊడిపోయిందట
|
| లేనిపోని పీకులాట ఎందుకట!
|
| లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాటట
|
| లేనివాడి తెగింపు కంటే ఉన్నవాడి పిరికితనం మేలు
|
| లేవలేని అత్తకు వంగలేని కోడలు
|
| లొసుగుల బేరం కాసుల చేటు
|
| లోకం మూయను మూకుడున్నదా?
|
| లోకులు పలుకాకులు
|
| లోగుట్టు పెరుమాళ్ళకెరుక
|
| లోభికి ఖర్చెక్కువ - ఏబ్రాసికి పనెక్కువ
|
| లోభికి నాలుగందాల నష్టం
|
| లోభికి ధర్మచింతన మెండు
|
| లోభి సొమ్ము దొంగపాలు
|
| వంకరో టింకరో వయసే చక్కన
|
| వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట
|
| వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ
|
| వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది?
|
| వంటిల్లు కుందేలు చొచ్చినట్లు
|
| వండని అన్నం - వడకని బట్ట
|
| వండలేనమ్మకు వగపులు మెండు - తేలేనమ్మకు తిండి మెండు
|
| వండాలేదు, వార్చాలేదు - ముక్కున మసెక్కడిది అన్నట్లు
|
| వండుకున్నమ్మకు ఒకటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు
|
| వంతుకు గంతేస్తే దిగింది బుడ్డ
|
| వంద మాటలు చెప్పొచ్చు - ఒక్కనికి పెట్టేదే కష్టం
|
| వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు
|
| వంపున్న చోటకే వాగులు
|
| వంపుసొంపులే ఫలపుష్పాలు - లేత పెదిమలే తమలపాకులు అన్నట్లు
|
| వంశమెరిగి వనితను - వన్నెనెరిగి పశువును తెచ్చుకోవాలి
|
| వగలమారి వంకాయ సెగలేక ఉడికిందట
|
| వగలెందుకంటే పొగాకు కోసం అన్నట్లు
|
| వచ్చింది కొంత - పఠించింది కొంత
|
| వచ్చింది పాత చుట్టమే - పాత చేట గొడుగు పట్టండి అన్నట్లు
|
| వచ్చిననాడు వరాచుట్టం - మరునాడు మాడ చుట్టం - మూడవనాడు మురికి చుట్టం
|
| వచ్చిన పేరు చచ్చినా పోదు
|
| వచ్చినవారికి వరాలు - రానివారికి శాపాలు
|
| వచ్చిపోతూ వుంటే బాంధవ్యం - ఇచ్చి పుచ్చుకుంటూంటే వ్యాపారం
|
| వచ్చీరాని మాట వరహాల మూట
|
| వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి
|
| వచ్చేకాలం కన్నా వచ్చిన కాలం మిన్న
|
| వచ్చే కీడు వాక్కే చెపుతుంది
|
| వచ్చేగండం చచ్చినా తప్పదు
|
| వచ్చేటప్పుడు వెంట తీసుకురారు - పోయేటప్పుడు వెంట తీసుకుపోరు
|
| వజ్రానికి సాన - బుద్ధికి చదువు
|
| వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి
|
| వట్టి గొడ్డుకు అరుపు లెక్కువ
|
| వట్టి చేతులతో మూర వేసినట్లు
|
| వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి
|
| వట్టి మాటలు కూటికి చేటు
|
| వడ్డించినదంతా మేం తింటాం ఆకులు మీరు నాకండి అన్నట్లు
|
| వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు
|
| వడ్లగాదిలో పందికొక్కులాగా
|
| వడ్లగింజలో బియ్యపు గింజ
|
| వడ్లతో గూడా తట్ట ఎండినట్లు
|
| వడ్లల్లో, రెడ్లల్లో ఎన్నో రకాలన్నట్లు
|
| వడ్లూ గొడ్లూ ఉన్నవానిదే వ్యవసాయం
|
| వనితకూ వయసుకూ తోడు కావాలి
|
| వయసుకు వర్జ్యం లేదన్నట్లు
|
| వయసుకోట వాయనం, సొగసుతోట పాయసం అన్నట్లు
|
| వనితగానీ, కవితగానీ వలచిరావాలి
|
| వయసు తప్పినా వయ్యారం పోలేదు
|
| వయసుపడే ఆరాటం సోయగాల సమర్పణకే అన్నట్లు
|
| వయసు ముసలెద్దు - మనసు కోడెదూడ
|
| వరహాకన్నా వడ్డీ ముద్దు - కొడుకుకన్నా మనమడు ముద్దు
|
| వరాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లు
|
| వరిమొలకా, మగమొలకా ఒకటి
|
| వలచివస్తే మేనమామ కూతురు వరుస కాదన్నట్లు
|
| వలపులు మనసుల్ని తడితే కోరికలు తనువుల్ని తడతాయట
|
| వసుదేవుడంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు
|
| వస్తూ ఏమి తెస్తావు? పోతూ ఏమిస్తావు?
|
| వస్త్రహీనం - విస్తరి హీనం పనికిరావు
|
| వాచినమ్మకు పాచినన్నం పెడితే పరమాన్నం పెట్టారని ఇరుగుపొరుగులకు చెప్పుకొన్నదట
|
| వాగాడంబరం - అధిక ప్రసంగం
|
| వాతలు మానుతాయి - వాదులు పోవు
|
| వాదులేక ప్రాణం - దాదిలేక రాణి పోరు
|
| వానకంటే ముందు వరద వచ్చినట్లు
|
| వానరాకడ, ప్రాణం పోకడ తెలియదు
|
| వానలకు మఖాకార్తె - కుక్కలకు చిత్తకార్తె
|
| వానవుంటే కరువులేదు - మగడు వుంటే దరిద్రం లేదు
|
| వాన వెలసినా చూరునీళ్ళు పడుతున్నట్లు
|
| వాపును చూచి బలుపనుకున్నట్లు
|
| వాపు బలుపు కాదు - వాత అందం కాదు
|
| వాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు
|
| వాసి తరిగితే వన్నె తరుగుతుంది
|
| విందు అయినా మూన్నాళ్ళు - మందు అయినా మూన్నాళ్ళు
|
| విందు మర్నాడు మందు
|
| విగ్రహపుష్టి - నైవేద్య నష్టి
|
| విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలన్నట్లు
|
| విడవమంటే పాముకు కోపం - పట్టమంటే కప్పకు కోపం
|
| విడిచిన ముండకు వీరేశలింగం
|
| విడిచినమ్మలు వియ్యమందబోతే అంతకంటే అడ్డాలమ్మ వచ్చి హారతిపట్టిందట
|
| విడిచేసిన వాడు వీధికి పెద్ద
|
| విత్తం కొద్దీ వైభవము
|
| విత్తటానికి శుక్రవారం - కోయటానికి గురువారం
|
| విత్తు ఒకటయితే చెట్టు ఒకటౌతుందా?
|
| విత్తుకొద్దీ పంట
|
| విత్తు ముందా? చెట్టు ముందా?
|
| విదియనాడు రాని చంద్రుడు తదియనాడు తనకు తానై కనబడతాడు
|
| విద్య కొద్దీ వినయము
|
| విధం చెడ్డా ఫలం దక్కాలి
|
| విధి వస్తే పొదలడ్డమా?
|
| వినాయకుడి మీద భక్తా? ఉండ్రాళ్ళ మీద భక్తా?
|
| విని రమ్మంటే తిని వచ్చినట్లు
|
| వినేవాటికీ - కనేవాటికీ బెత్తెడే దూరం
|
| విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు
|
| విన్నమ్మ వీపు కాలింది - కన్నమ్మ కడుపు కాలింది
|
| వియ్యానికి కయ్యం తోబుట్టువు
|
| వియ్యానికయినా కయ్యానికయినా సమవుజ్జీ వుండాలి
|
| వియ్యాలందితే కయ్యాలందుతాయి
|
| విరిగిన వేలు మీద ఉచ్చ పోయనన్నట్లు
|
| విరుచుకుని విరుచుకుని వియ్యాలవారింటికి పోతే పలుగురాళ్ళతో నలుగు పెట్టారట
|
| విల్లంబులు కలవారికి చల్లకుండలవారు తోడా?
|
| విశాఖ కురిస్తే విషము పెట్టినట్లే
|
| విశాఖ చూచి విడువర కొంప
|
| విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లే
|
| విశాఖలో వర్షం - వ్యాధులకు హర్షం
|
| విశాఖలో వరదలు - సంక్రాంతికి మబ్బులు
|
| విషానికి విషమే విరుగుడు
|
| విస్తరి కొదవా, సంసారపు కొదవా తీర్చేవారు లేరు
|
| విస్తరి చిన్నది - చెయ్యి పెద్దది
|
| విస్సన్న చెప్పింది వేదం
|
| వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు
|
| వీపున కొట్టచ్చుగానీ, కడుపుమీద కొట్టరాదు
|
| వీరభద్రపు పళ్ళెములాగా
|
| వీలెరిగి మాట - కీలెరిగి వాత
|
| వీసం యిచ్చి గంపెడు అడిగినట్లు
|
| వీసంలో మానెడు తీసినట్లు
|
| వృద్ధనారీ పతివ్రత
|
| వృద్ధ వైద్యం - బాల జోస్యం
|
| వృష్టికి ప్రమాణాలు - ఉత్తర, హస్త కార్తెలు
|
| వెంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది
|
| వెంటపోయినా వెనుక పోరాదు
|
| వెంట పోయైనా చూడాలి - వెంట వుండయినా చూడాలి
|
| వెంపలి చెట్టుకు నిచ్చెన వేసినట్లు
|
| వెక్కిరించబోయి వెల్లికిలా పడ్డట్లు
|
| వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు
|
| వెదకబోయిన తీర్థం ఎదురయినట్లు
|
| వెధవముండ కాళ్ళకు మ్రొక్కితే నాలాగే వర్ధిల్లమని దీవించిందట
|
| వెనక నొక్కుళ్ళేనా ముందు పనులున్నాయా అందిట
|
| వెన్న అరచేతిలో పెట్టుకుంటే అడక్కుండానే కరుగుతుంది
|
| వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లత్రాగిన వాడ్ని కొట్టినట్లు
|
| వెన్న పెడితే తినలేడు - వేలు పెడితే కొరకలేడు
|
| వెన్ను ముదిరినట్లు
|
| వెన్నెల వేళే విరహాలన్నట్లు
|
| వెయ్యి అబద్ధాలు చెప్పయినా ఒక పెళ్ళి చేయాలి
|
| వెయ్యి గుళ్ళ పూజారి
|
| వెర్రి కుదిరింది - తలకు రోకలి చుట్టమన్నాడట
|
| వెర్రివాడా వెర్రివాడా అంటే వెక్కెక్కి ఏడ్చాడట
|
| వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ లోకువ
|
| వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ మరదలు
|
| వెర్రివాడి పెళ్ళాం వాడకల్లా వదినే
|
| వెర్రివాడికి పెళ్ళిచేస్తే వేలెట్టి కెలికాడట
|
| వెర్రివాని చేతి రాయిలాగా
|
| వెర్రి వేయి విధాలన్నట్లు
|
| వెల తక్కువ - ఫల మెక్కువ
|
| వేటుకు వేటు - మాటకు మాట
|
| వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్లు
|
| వేడినీళ్ళకు ముందు, పంక్తి భోజనానికి వెనుక పోగూడదు
|
| వేడుకకు వెల లేదు
|
| వేలు మీద గోరు మొలిచింది వేరుపోదాం రారా మగడా! అన్నదట
|
| వేలం వెర్రి - గొర్రెవాటు
|
| వేలుకు వేలు ఎడమా?
|
| వేలు చూసి అవలక్షణ మనిపించుకొన్నట్లు
|
| వేలు చూపితే హస్తం మింగుతాడన్నట్లు
|
| వేలు పెట్టేందుకు చోటిస్తే తల దూర్చినట్లు
|
| వేలు వంక పెడితేగానీ వెన్న రాదు
|
| వేలు వాచి రోలంతయితే, రోలు వాస్తే మరెంత కావాలి?
|
| వేశ్య - వైశ్యుడు అబద్ధాల కోరులే
|
| వేషాల కోసం దేశాల పాలయినట్లు
|
| వేషాలమారికి వేవిళ్ళొస్తే, ఉన్నచోటు విడవను అన్నదట
|
| వేషాలెన్ని వేసినా కూటి కోసమే
|
| వేసిందే ఒక గంతు - దిగిందే ఒక బుడ్డ
|
| వేసిందే ఒక గంతు - విరిగిందే ఒక కాలు
|
| వేసిన వత్తికి - పోసిన చమురుకు సరి
|
| వేసినట్టే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడు
|
| వేసేది విషముష్ఠి విత్తనాలు - ఆశించేవి మధుర ఫలాలు
|
| వైదీకి వైద్యంలో చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటే
|
| వైద్యం నేర్వనివాడూ - వానకి తడవనివాడూ వుండడు
|
| వైద్యుడి పెళ్ళాంగూడా ముండ మోసేదే
|
| వైద్యుడు రోగాలు కోరు - వైశ్యుడు కరువు కోరు
|
| వైద్యుని భార్యకే భగంధర రోగము
|
| వైద్యుని పేరు చెపితే రోగాలు పారిపోతాయా?
|
| వైరాగ్యం ముదిరితే వారవనిత కూడా తల్లితో సమానం
|
| వ్యవసాయం గుడ్డాడి చేతిరాయి
|
| వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం
|
| వ్యాధికి రట్టు, సంసారానికి గుట్టు కావాలి
|
| వ్యాధికి మందుకానీ విధికి మందా?
|
| వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడట
|
| వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోక్తమా?
|
| వ్రతం చెడ్డా ఫలం దక్కాలి
|
| వ్రాత కరణమా? మేత కరణమా? అన్నట్లు
|
| వ్రాత బలికోరును
|
| వ్రాయగా వ్రాయగా కరణం - దగ్గగా దగ్గగా మరణం
|