| మంగలంలోని పేలాల్లాగా
|
| మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు
|
| మంగలి పనిలాగా
|
| మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే
|
| మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే
|
| మంచం మీద వున్నంతసేపే మగడు - కిందికి దిగితే యముడు
|
| మంచం వేసేంతవరకే ఇద్దరం - మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట
|
| మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట
|
| మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లు
|
| మంచమెక్కిన మీదట మర్యాదలేల?
|
| మంచమెక్కి వావి వరుస లడిగినట్లు
|
| మంచికి పోతే చెడు ఎదురైనట్లు
|
| మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లు
|
| మంచి ఆలి కొక మాట - మంచి ఎద్దు కొక వాత
|
| మంచి కొంచమైనా చాలు
|
| మంచి గొడ్డుకొక దెబ్బ - మంచి మనిషికొక మాట
|
| మంచి చెడ్డలు పడుగు పేకలు
|
| మంచి మరణంలో తెలుస్తుంది
|
| మంచి మాటకు మంది అంతా మనవాళ్ళు
|
| మంచివాడు మంచివాడు అంటే యిల్లంతా నాశనం చేశాడట
|
| మంచివాడికి మాటే దెబ్బ
|
| మంత్రం లేని తీర్థం మరి బక్కెడు
|
| మంత్రం లేని సంధ్యకు మరి చెంబుడు నీళ్ళు
|
| మంత్రంలో పస లేకపోయినా తుంపర్లకు కొదవలేదు
|
| మంత్రసాని పనికి ఒప్పుకొన్నాక ఏది వచ్చినా పట్టాలి
|
| మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
|
| మందికి నీతి చెప్పాను కానీ - నీకూ నాకూ కాదు అన్నాడట
|
| మందిని మ్రింగే యిల్లుండాలి గానీ - ఇంటిని మ్రింగే మంది ఉండరాదు
|
| మందిని ముంచి గుడి కట్టినట్లు
|
| మంది ఎక్కువయితే మజ్జిగ పలచన
|
| మందుకు పథ్యం - మాటకు సత్యం
|
| మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు
|
| మందూ, మాకూ లేదన్నట్లు
|
| మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు
|
| మగడు విడిచిన ముండ - మబ్బు విడిచిన ఎండ
|
| మగని చుట్టాలు చెప్పులు ముంగిట్లో విడిస్తే - ఆలి చుట్టాలు వంటింట్లో విడుస్తారు
|
| మగనికి మాడు చెక్కలు - మిండడికి పంచభోజ్యాలు
|
| మగువే మగవాడికి మధుర భావన
|
| మఘ ఉరిమితే మదురు మీద కర్ర అయినా పండుతుంది
|
| మఘ, పుబ్బలు వరుసయితే క్షామం
|
| మఘలో మానెడు - పుబ్బలో పుట్టెడు
|
| మట్టిపనికైనా స్వంతవాడే కావాలి
|
| మట్టిలో మాణిక్యంలాగా
|
| మట్టెల చప్పుడే కానీ చేసే పనేమీ లేదు
|
| మడికి గట్టు, యింటికి గుట్టు, మాటకు మంచి కావాలి
|
| మడి బీదకాదు - రైతే బీద
|
| మతి ఎంతో గతి అంత
|
| మతిలేనమ్మకు గతి లేని మగడు
|
| మతిలేని మాటకు శృతిలేని పాట
|
| మదిలో ఒకటి - మాటలో ఒకటి
|
| మద్దెల పోయి రోలుతో మొర పెట్టుకున్నట్లు
|
| మన బంగారం మంచిదయితే కంసాలిని వన్నె అడగడం దేనికి?
|
| మన్మథ రాజ్యంలో ముద్దుల మద్దెల మోతలే వుంటాయన్నట్లు
|
| మనసుకు మనసే సాక్షి
|
| మనసున నాటిన మాటలు చెరుపలేరు
|
| మనసు విరిగితే అతుక్కోదు
|
| మనసుంటే మార్గముంటుంది
|
| మనసు కుదిరితే మల్లి - కుదరకుంటే ఎల్లి
|
| మనసుకు ముఖమే సాక్షి
|
| మనసు మంచిదే - గుణమే గుడిసేటిది
|
| మనసు మనువు కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందట
|
| మనసు మహామేరువు రాటుతుంది - కాలు కందకం దాటదు
|
| మనసు లేని మనువులాగా
|
| మనసులో ఏముంటే సోదిలో అదే వస్తుంది
|
| మనసులో చింతకు మందులేదు
|
| మనసైన అమ్మాయి నవ్వు మన్మథుని శరమైన పువ్వన్నట్లు
|
| మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు
|
| మనిషి కాటుకు మందు లేదు
|
| మనిషికి ఉన్నది పుష్టి - గొడ్డుకు తిన్నది పుష్టి
|
| మనిషికి ఒక మాట - గొడ్డుకు ఒక దెబ్బ
|
| మనిషికి కాక మానులకు వస్తాయా కష్టాలు?
|
| మనిషికి మాటే అలంకారం
|
| మనిషికొక తెగులు మహిలో వేమా
|
| మనిషి చస్తే మాట మిగులుతుంది
|
| మనిషి పేదయితే మాటకు పేదా?
|
| మనిషి సంగతి మాట చెపుతుంది
|
| మనీకి ముందు - పనికి వెనుక అన్నట్లు
|
| మనుగుడుపుల అల్లుడూ - చెరకు తోటలో ఏనుగూ ఒక్కటే
|
| మనువాడిన తర్వాతే అందాల విందులు అందిట
|
| మనువొక చోట - మనసొక చోట
|
| మనుషులు పోయినా మాటలు వుంటాయి
|
| మనోవ్యాధికి మందు లేదు
|
| మన్ను తిన్న పామువలె
|
| మన్ను పడితే బంగారం - బంగారం పడితే మన్ను
|
| మబ్బులో పొద్దు
|
| మర్దనం గుణవర్ధనం
|
| మరదలి సరసం మొగలి పువ్వుల వాసన వంటిది
|
| మరుని విందుకు పరదా లెందుకు?
|
| మరులున్నవాడే మగడు
|
| మర్యాదకు పోతే మానం దక్కదు
|
| మర్రి చెట్టుక్రింద మొక్కలు కావు
|
| మరో లోకానికి వెళ్ళినా మారుటి తల్లి వద్దు
|
| మలప బుద్ధులు - పిదప చేష్టలు
|
| మలప సన్యాసి వేషాలు వేసినట్లు
|
| మలుగులు క్రుంగితే మాపటికి ఈనుతుంది
|
| మల్లెల జ్వరానికి అందాల గంధమే మందు అన్నట్లు
|
| మల్లెల మంచం మీదే మన్మథ లంచం అన్నదట
|
| మల్లెల వేళలో వయసు సొగసుల విందు లన్నట్లు
|
| మసి పాత్రలో మాణిక్యంలాగా
|
| మసి పూసి మారేడు కాయ చేసినట్లు
|
| మసి మొగంగాడూ, చమురు కాళ్ళవాడూ జతకలిసినట్లు
|
| మహాజనానికి మరదలు పిల్లన్నట్లు
|
| మహారాజని మనవి చేసుకుంటే, మరి రెండు తగిలించమన్నాడట
|
| మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి
|
| మహాభారతంలో ఆదిపర్వ మన్నట్లు
|
| మహా వ్యసనాలుంటే గానీ మహాత్ములు కాలేదన్నట్లు
|
| మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా?
|
| మాంసం తినేవాడు పోతే ఎముకలు కొరికే వాడు వస్తాడు
|
| మా ఆయనే ఉంటే మంగలి వాణ్ణయినా పిలుచుకొని వచ్చేవాడు అన్నదట
|
| మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్? మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్?
|
| మాకు జయం - మీకు ఋణం
|
| మా గేదె చస్తే చచ్చిందిగానీ ఎదురింటి గేదె పాలివ్వకపోతే చాలు
|
| మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరదు
|
| మాఘమాసపు వాన మగడు లేని జాణ
|
| మాఘమాసపు చలికి చెట్లుకూడా వణుకుతాయి
|
| మాచకమ్మ సౌందర్యంలాగా
|
| మాటకారి - నీటుగాడు
|
| మాటకు ప్రాణంగానీ మూటకు ప్రాణమా?
|
| మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు
|
| మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి
|
| మాటకు ముందు ఏడ్చేవాడిని - నవ్వే ఆడదానిని నమ్మరాదు
|
| మాటకు హరిశ్చంద్రుడి లాగా
|
| మాట గొప్ప చెప్ప మాటలు చాలవు
|
| మాట చుట్టమా? పెట్టు చుట్టమా?
|
| మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే
|
| మాట మంచి - చేత చెడ్డ
|
| మాట మీకు - మూట మాకు
|
| మాటలతో మూటలూ, మాన్యాలు సంపాదించవచ్చు
|
| మాటల పసేగానీ చేతల పస లేదు
|
| మాటలు కోటలు దాటుతాయ్ కాళ్ళు గడప దాటవు
|
| మాటలు చెప్పే మొనగాళ్లేగానీ బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు
|
| మాటలు తల్లి మాటలు - పెట్టు సవతి తల్లి పెట్టు
|
| మాటలు, పాటలు మాయింట్లో, మాపటి భోజనం మీ యింట్లో
|
| మాటలు నేర్చిన కుక్కల్ని వేటకు తీసుకెళితే యిస్కో అంటే యిస్కో అన్నాయట
|
| మాటలు నేర్చినమ్మ ఏడ్చినా అందమే
|
| మాట లేకుంటే చోటే లేదు
|
| మాటలే మంత్రాలు - మాకులే మందులు
|
| మాటల్లోపడి మగణ్ణి మరచినట్లు
|
| మాటల్లో మరులు - చేతల్లో స్వర్గాలు
|
| మాట్లాడితే మల్లెలు - కాట్లాడితే కందిరీగలు
|
| మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు
|
| మాదిగవాని ఆలయినా మాడే కాలికి చెప్పుండదు
|
| మానం చూపి ప్రాణం తీసినట్లు
|
| మానంతో మనీ - మనీతో జల్సా అన్నట్లు
|
| మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు?
|
| మానవ సేవే మాధవ సేవ
|
| మానిందే మందు - బ్రతికిందే బ్రతుకు
|
| మానిన పుండును రేపినట్లు
|
| మాపటికి మనసు - రేపటికి సొగసు అన్నట్లు
|
| మాపటేళ ఆకలి, పెదవుల దాహం తీరవన్నట్లు
|
| మామ బంతిన కూర్చుని అత్త బంతిన లేచినట్లు
|
| మామా ఒకింటి అల్లుడే
|
| మామిళ్ళకు మంచు చెరుపు - కొబ్బరికి కుడితి చెరుపు
|
| మారులేని తిండి మాలతిండి
|
| మార్గశిరలో మాట్లాడటానికి ప్రొద్దుండదు
|
| మాలకూటికి పోయినా పప్పు నీళ్ళే
|
| మాల పల్లెలో మంగళాష్టకాలు
|
| మాల బడాయి పాటి మీద - మొగుడి బడాయి ఆలి మీద
|
| మావి మాకిస్తే రాజ్యమిచ్చినట్లే
|
| మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనెట
|
| మింగ మెతుకులేదు, లంజకు లత్తుకట
|
| మింటికీ, మంటికీ ముడి వేసినట్లు
|
| మిండలను మరిగినమ్మా, మీగడ తిన్నమ్మా ఊరుకోరు
|
| మిడతంభొట్ల జోస్యంలాగా
|
| మితం తప్పితే హితం తప్పుతుంది
|
| మిధునంలో పుట్టిన మొక్కా, మీసకట్టుతో పుట్టినకొడుకూ అక్కర కొస్తారు
|
| మిన్ను విరిగి మీదపడ్డట్లు
|
| మీ ఇంట్లో తిని మా యింట్లో చేయి కడుగమన్నట్లు
|
| మీకు మాట నాకు మూట
|
| మీద మెరుగులు - లోన పురుగులు
|
| మీ వూరు మావూరి కెంత దూరమో, మా వూరూ మీ వూరి కంతే దూరం
|
| మీన మేషాలు లెక్క పెట్టినట్లు
|
| ముంజేతి కంకణానికి అద్దమేల?
|
| ముండకు దొరికేది మోటు మొగుడే
|
| ముండకు దొరికేవి మొండి శిశినాలే
|
| ముండ మొయ్యవచ్చు గానీ నింద మొయ్యరాదు
|
| ముండ మోసినట్లుగా
|
| ముండా కాదు, ముత్తయిదువా కాదు
|
| ముంతపాలు కుర్రాడికి - బంతులాట మంచానికి
|
| ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లు
|
| ముందరున్నది ముసళ్ళ పండుగ
|
| ముందు ఆకు తెచ్చుకుంటే ఎప్పుడైనా తినవచ్చు
|
| ముందుకు పోతే మురికి ముండ - వెనుకకు పోతే వెర్రి ముండ
|
| ముందు నుయ్యి - వెనుక గొయ్యి
|
| ముందూ నడిచే ముతరాచువాణ్ణీ - వెనుకనడిచే ఏనాది వాడినీ నమ్మరాదు
|
| ముందు పెళ్ళాం బిడ్డలు మెతుకులేక ఏడుస్తుంటే ఉంచుకున్నదానికి పిల్లలులేరని పూజలు చేసాట్ట
|
| ముందు ముచ్చట్లు -వెనుక చప్పట్లు
|
| ముందు మురవబోకురా ముతరాచు వాడా అన్నట్లు
|
| ముందు మురిసినమ్మకు పండుగ గుర్తుండదు
|
| ముందు మూడుముళ్ళ ముచ్చట - తర్వాత సోయగాల జాతర అందట
|
| ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి
|
| ముందు వాళ్ళకు మూకుళ్ళు - వెనుక వాళ్ళకు నాకుళ్ళు
|
| ముక్కు ఉండేంత వరకే పడిశ ముంటుంది
|
| ముక్కు ఏదంటే తల చుట్టూ త్రిప్పి చూపినట్లు
|
| ముక్కు కోసినా మొదటి మొగడే మేలు
|
| ముక్కు మూరెడు సిగ బారెడు
|
| ముక్కు మూసుకుంటే మూడు ఘడియలు
|
| ముక్కులో ఏ వేలు పెట్టినా సరిపోతుంది
|
| ముక్కులో చీమిడుందంటే, నీ చేత్తోనే తీయమన్నట్లు
|
| ముక్కూ మొహం తెలీనట్లు
|
| ముఖం అందం మానానికి చేటు
|
| ముఖం చూచి బొట్టు పెట్టినట్లు
|
| ముఖంలో సుఖంలేదు - మోకాళ్ళలో బిగువు లేదు
|
| ముఖారవిందం - భజగోవిందం
|
| ముగ్గురికి తెలిస్తే మూడు లోకాలకు ప్రాకుతుంది
|
| ముట్టుకుంటే ముత్యం - పట్టుకుంటే బంగారం
|
| ముడ్డిక్రిందకు నీళ్ళు వస్తే కానీ లేవరు
|
| ముడ్డి గిల్లి జోల పాట పాడినట్లు
|
| ముడ్డి మీద తంతే మూతిపళ్లు రాలినట్లు
|
| ముత్యపుచిప్పలన్నీ ఒక చోట - నత్తగుల్లలన్నీ ఒకచోట
|
| ముత్యమంత పదునుంటే మూల కార్తెలో చల్లినా ఉలవచేను పండుతుంది
|
| ముత్యాలు, పగడాలు, ముట్టుకుంటే జగడాలు
|
| ముదిమిన ముచ్చట్లు లావు
|
| ముద్దంటే ఒకింత మత్తు - ఒద్దంటే మరింత కోపం
|
| ముద్ద ముద్దకీ బిస్మిల్లానా!
|
| ముద్దుగుమ్మ కౌగిలింత నిద్రరాని ఆవులింత అన్నట్లు
|
| ముద్దు చేసిన కుక్క మూతి నాకితే - రంకు నేర్చిన రమణి రచ్చ కీడ్చిందట
|
| ముద్దున పేరు, మురిపాన నడక చెడతాయి
|
| ముద్దూ, మురిపెం మావంతు - ముడ్డీ, దొడ్డీ మీవంతు
|
| ముద్దూ మురిపాలు కౌగిళ్ళలోనే అన్నట్లు
|
| మునగానాం తేలానాం మూసివాయనం అన్నట్లు
|
| మునిగితే గుండు - తేలితే బెండు
|
| మునిగే వాడికి తెలుసు నీటి లోతు
|
| ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు
|
| మురిపాలు, ముచ్చట్లు అంటే ముసుగు పెడతాడన్నట్లు
|
| మురిపెం తిరిపెం చేటు - ముసలి మొగుడు మంచానికి చేటు
|
| ముల్లు తీయాలంటే ముల్లే కావాలి
|
| ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం
|
| ముష్టికి నష్టి ఏమిటి?
|
| ముష్టికి నష్టి వీరముష్టి
|
| ముసలి కాలానికి ముప్పతిప్పలు
|
| ముసలివానికి ముండ ముద్దు
|
| ముసలి ముగ్గురిని మార్చినట్లు
|
| ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట
|
| ముసుగులో గుద్దులాట
|
| మూగవాని ముందు ముక్కు గోక్కున్నట్లు
|
| మూట పోతే పోయింది మాట పోరాదు
|
| మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి
|
| మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమౌతాయి
|
| మూడు రోజులుంటే మురికి చుట్టం
|
| మూడునాళ్ళ ముచ్చట
|
| మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు
|
| మూడు మాటలు - ఆరు తప్పులు
|
| మూడొచ్చి ముందుకొస్తే మూడంకె వేసిందట
|
| మూతి ముద్దుల కేడిస్తే వీపు గుద్దుల కేడుస్తుంది
|
| మూడుముళ్ళ ముచ్చట
|
| మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది
|
| మూరెడు పొంగటం ఎందుకు? బారెడు క్రుంగటం ఎందుకు?
|
| మూల కురిస్తే ముంగారు పారు
|
| మూల ముంచు - జ్యేష్ఠ చెరచు
|
| మూల వాన ముంచక మానదు
|
| మూలవిరాట్లు ముష్టెత్తుకుంటూంటే ఉత్సవవిగ్రహాలకు ఊరేగింపట
|
| మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
|
| మూలుగులు మునుపటిలాగే - భోజనాలు ఎప్పటిలాగే
|
| మూసివాయనం ముత్తయిదువులాగా
|
| మూసిన ముత్యం - పాసిన పగడం
|
| మూసి పెడితే పాచిపోయిందట
|
| ముళ్ళు వేయటం చేతగాదుగానీ కోక ముడి విప్పనా అంటాడట పాపం!
|
| మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయి
|
| మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది
|
| మృగశిరలో ముల్లోకాలు చల్లబడతాయి
|
| మృగశిరలో వేసిన పైరు, మీసాలు రావడంతో పుట్టిన కొడుకు మేలు
|
| మృగశిర కురిస్తే మఖ గర్జిస్తుంది
|
| మెచ్చి మేకతోలు కప్పినట్లు
|
| మెడబట్టి నెడితే చూరుపట్టుకుని వ్రేలాడినట్లు
|
| మెడలో రుద్రాక్షలు - మదిలో మదిరాక్షులు
|
| మెతుకవుతే బ్రతుకవుతుంది
|
| మెత్తగా వుంటే మొత్తబుద్ధి వేస్తుంది
|
| మెత్తనివాళ్లను చూస్తే మొత్తబుద్ధి వేసినట్లు
|
| మెరుపు దీపం కాదు - మబ్బు గొడుగు కాదు
|
| మేకకు తెలిసిందంతా మేత సంగతే
|
| మేకపోతు గాంభీర్యంలాగా
|
| మేక వన్నె పులి
|
| మేతకన్నా మసలితేనే బలం
|
| మేత కరణంగానీ కూత కరణం కాదు
|
| మేతకేగాని చేతకు కొరగాడు
|
| మేనత్త పోలిక - మేనమామ చాలిక
|
| మేయబోతే ఎద్దుల్లోకి దున్నపోతే దూడల్లోకి
|
| మేలు మరువరాదు - కీడు పలుకరాదు
|
| మేసేగాడిదను కూసేగాడిద వచ్చి చెరచినట్లు
|
| మొండికి సిగ్గులేదు - మొరడుకు గాలి లేదు
|
| మొండికీ, బండకూ నూరేళ్లాయుష్షు
|
| మొండి గురువు - బండ శిష్యుడు
|
| మొండిచేత్తో మూర వేసినట్లు
|
| మొండిచేతి వానికి నువ్వులు తినటం నేర్పినట్లు
|
| మొండివాడు రాజుకంటే బలవంతుడు
|
| మొక్కబోయిన దేవర ఎదురైనట్లు
|
| మొక్కై వంగనిది మానై వంగుతుందా?
|
| మొగబుద్ధి మోటబుద్ధి - ఆడబుద్ధి అపర బుద్ధి
|
| మొగమాటానికి పోతే కడుపైనట్లు
|
| మొగుడికి దిండు - వుంచుకున్న వాడికి దేహం
|
| మొగుడికి మొద్దులు - మిండడికి ముద్దులు
|
| మొగుడికే మగతనం ఉంటే పొరుగింటాయనతో పనేంటి? అందిట
|
| మొగుడి కౌగిలి మొగలి పరిమళం
|
| మొగుడితో పెళ్ళికీ, పిల్లలతో తీర్థానికీ వెళ్ళరాదు
|
| మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు
|
| మొగుడిని కొట్టి మొరపెట్టుకున్నట్లు
|
| మొగుడిమీద కోపం ప్రొద్దుగూకేంత వరకే
|
| మొగుడివాసన వచ్చేంతవరకూ ముసలివాసన తప్పదు
|
| మొగుడు కొట్టినందుకు కాదుగానీ తోటికోడలు/ప్రక్కవాళ్ళు నవ్వినందు కేడ్చిందట
|
| మొగుడు కొద్దీ వన్నెలు - సిరి కొద్దీ చిన్నెలు
|
| మొగుడు లేనిదానికి మంత్రసానెందుకు?
|
| మొగుడే ముండా అంటే ముష్టికి వచ్చినవాడూ ముండా అంటాడు
|
| మొదటికే మోసమయితే, లాభాలకు గుద్దులాటా?
|
| మొదటి దానికి మొగుడులేడు - కడదానికి శోభనమట
|
| మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలినట్లు
|
| మొదటే కోతి, పైగా కల్లు తాగింది, ఆపై నిప్పులు త్రొక్కింది
|
| మొద్దు మొహానికి అలంకరణ గూడానా?
|
| మొరిగే కుక్క కరవదు
|
| మొలది విప్పి తలకి చుట్టుకొన్నట్లు
|
| మోచేతి దెబ్బ - మొగుడి కాపురం ఒకటి
|
| మోటువాడికి మొగలిపువ్విస్తే మడిచి ముడ్డిలో పెట్టుకున్నాడట
|
| మోసేవాడికి తెలుస్తుంది బరువు
|
| మోహం లేకపోతే మోదం లేదు
|
| మౌనం అర్ధాంగీకారం
|
| మౌనేన కలహం నాస్తి
|